News May 11, 2024

శ్రీకాకుళం: ప్రచారం CLOSE

image

ఎన్నికల క్రతువులో ముఖ్యఘట్టమైన ఎన్నికల ప్రచారం క్లోస్ అయింది. ప్రచార వాహనాలకు బ్రేక్ పడింది. సౌండ్ బాక్సుల మోతలు, డీజే శబ్దాలు ఆగిపోయాయి. చట్టసభల్లో అడుగుపెట్టేందుకు దాదాపు నెలరోజులుగా పోటీలో నిలిచిన నాయకులు నిత్యం ప్రజాక్షేత్రంలో ఓట్లు అభ్యర్థించగా.. హామీలు, విమర్శలు అన్నింటికీ ఫుల్ స్టాప్ పడింది. ఇకపై ఓటర్ అన్నదే ఫైనల్ తీర్పు మిగిలి ఉంది.

Similar News

News December 24, 2025

అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి: మంత్రి అచ్చెన్న

image

అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి కింజరాపు అచ్చెన్న అధికారులను ఆదేశించారు. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం గ్రీవెన్స్ నిర్వహించారు. గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదుదారుడు చేసిన అంశాలను జాగ్రత్తగా పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

News December 24, 2025

రణస్థలం: మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

image

గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్న ఘటన రణస్థలంలోని పైడిభీమవరంలో చోటుచేసుకుంది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల మేరకు సీహెచ్ పురుషోత్తం ఆచారి (52) విరేచనాల మందు, సెంటు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. కొంతకాలంగా గుండె వ్యాధితో బాధపడి, మనస్తాపానికి గురయ్యాడన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 24, 2025

ఈ నెల 26న మీ చేతికి మీ భూమి: మంత్రి

image

మీ చేతికి మీ భూమి 22 ఏ భూస్వేచ్ఛ పేరుతో ప్ర‌త్యేక డ్రైవ్ ను ఈ నెల 26న శ్రీకాకుళంలోని జడ్పీ కార్యాలయంలో నిర్వ‌హిస్తున్నామ‌ని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో జడ్పీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిషేధిత భూముల విష‌య‌మై ఎవ్వ‌రైనా విజ్ఞాప‌న‌లు చేసుకోవ‌చ్చ‌న్నారు. సంబంధిత అర్జీల‌ను రెవెన్యూ అధికారులు ప‌రిశీలించి, న్యాయం చేస్తారన్నారు.