News May 11, 2024
శ్రీకాకుళం: ప్రచారాలు చేయరాదు: కలెక్టర్

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం పోలింగ్ తేదికి 48 గంటల ముందు అనగా ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6.00 గంటల నుంచి ప్రచారం ఆపేయాలని జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జీలాని సమూన్ పేర్కొన్నారు. ఈ సైలెన్స్ పీరియడ్‌లో ఎవరు ప్రచారం చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల12, 13 తేదీల్లో మద్యం అమ్మకాలు నిలిపి వేయాలని ఆయన ఆదేశించారు.
Similar News
News February 9, 2025
కోటబొమ్మాళి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ సంతబొమ్మాళికి చెందిన రామారావు శనివారం కన్నుమూశారు. ఎస్సై వెంకటేశ్వరరావు కథనం..అతను జనవరి 28న భార్యను మద్యం తాగేందుకు డబ్బులు అడగగా .. మందలించిందని విషం తాగాడు. గమనించిన రామారావు కుమారుడు కుటుంబీకులకు సమాచారమిచ్చి ఆసుపత్రిలో చేర్చారు. కాగా చికిత్స పొందుతూ కోలుకోలేక శనివారం మృతిచెందారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
News February 9, 2025
శ్రీకాకుళం: తాను చనిపోతూ చూపునిచ్చాడు

శ్రీకాకుళం పట్టణం బ్యాంకర్స్ కాలనీలో నివాసం ఉంటున్న బురిడి ముఖలింగం (75) శనివారం మృతి చెందారు. అతని నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ జగన్మోహన్ రావుకు తెలిపారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రానికి చెందిన ఐ టెక్నీషియన్ సుజాత, జగదీశ్, పవన్ అతని కార్నియాలు సేకరించారు. విశాఖపట్నం ఎల్.వి నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.
News February 8, 2025
శ్రీకాకుళం: ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన ఎస్సీ

పొందూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళ్తే స్థానిక మండలంలోని కాజీపేట వద్ద జరిగిన కొట్లాట కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ చర్యలు తీసుకున్నామని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి చెప్పారు. కాగా ఈ కొట్లాటకు సంబంధించి హత్యాయత్నం కేసు నమోదైందన్నారు. కానిస్టేబుళ్ల నిర్లక్ష్యం దీనికి కారణమన్నారు.