News February 21, 2025

శ్రీకాకుళం ప్రజలారా జాగ్రత్త…!

image

శ్రీకాకుళం అంటేనే వలసలు గుర్తుకొస్తాయి. చదువు రాని వాడు చేపల వేటకు రాష్ట్రాలు దాటి వెళ్తున్నాడు. కాస్తోకూస్తో చదివినోడు దుబాయ్, ఇటలీ, మలేషియా అంటూ విమానం ఎక్కుతున్నాడు. వీళ్ల కష్టాలే కొందరికి వరంగా మారింది. విదేశాల్లో ఉద్యోగాలు తీసిస్తామంటూ రూ.లక్షలు దోచేస్తున్నారు. వీరిని నమ్మి పరాయి దేశానికి వెళ్తున్న సిక్కోలు బిడ్డలు కష్టాలు పడుతున్నారు. జిల్లాలో ఈమోసాలు ఇటీవల ఎక్కువైపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Similar News

News July 7, 2025

శ్రీకాకుళంలో నేడు పీజీఆర్‌ఎస్

image

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో నేడు జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.

News July 6, 2025

ఆమదాలవలస: పార్ట్ టైం పేరుతో వెట్టి చాకిరి తగదు

image

పార్ట్ టైం పేరుతో వీఆర్ఏలతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందని రాష్ట్ర వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు షేక్ బందిగీకి సాహెబ్ అన్నార. వీఆర్ఏ సంఘం 7వ జిల్లా మహాసభ ఆదివారం ఆమదాలవలసలో జరిగింది. వీఆర్ఏలు ఫుల్ టైం విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని, కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ మాదిరిగా రాష్ట్రంలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని కోరారు.

News July 6, 2025

శ్రీకాకుళం: మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనాలు పెంచాలి

image

మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతనాలు పెంచి వారి సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్‌ చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల, స్కూల్ స్వీపర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. మెనూ ఛార్జీలు ఒక్కొక్క విద్యార్థికి కనీసం రూ.20/-లు ఇవ్వాలని కోరారు. గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు.