News November 18, 2024

శ్రీకాకుళం: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వికేంద్రీకరణ

image

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) ను ఈ సోమవారం నుంచి మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చన్నారు.

Similar News

News December 13, 2024

శ్రీకాకుళం: యువకుడి జీవితానికి ‘ది ఎండ్’

image

శ్రీకాకుళం జిల్లా IIITలో <<14862988>>చనిపోయిన <<>>ప్రవీణ్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేవాడు. ఇటీవల కాస్త డల్‌ అయ్యాడు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడలేదు. మూడు రోజుల కిందట ‘ది ఎండ్’ అని మెయిల్లో రాశాడు. బుధవారం రాత్రి 12 గంటల వరకు చదువుకున్నాడు. తర్వాత బయటకు వెళ్తుండగా ఫ్రెండ్స్ చూసి ఎక్కడికి అని ప్రశ్నించారు. వాష్ రూముకు వెళ్తున్నా అని చెప్పి బిల్డింగ్‌ పైనుంచి దూకేశాడు. ‘నన్ను తీసుకెళ్లండి’ అన్నవే ప్రవీణ్ చివరి మాటలు.

News December 13, 2024

ఇచ్ఛాపురం: మసీదులో హిందువులు ప్రత్యేక పూజలు

image

ఇచ్ఛాపురం పట్టణంలోని పీర్ల కొండపై గురువారం పీర్ల పండగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆంధ్ర-ఒడిశా నుంచి వందలాది మంది భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఏటా నవంబర్‌లో నాలుగు గురువారాలు కొండపై పీర్ల పండుగ ఇక్కడ జరుగుతుంది. కొండపై ఉన్న మసీదుకు హిందువులు పెద్ద సంఖ్యలో చేరుకుని పూజలు నిర్వహిస్తారు. దీంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.

News December 12, 2024

SKLM: రేషన్ పంపిణీలో జాప్యం వద్దు-జేసీ

image

ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీని వేగవంతం చేసి అర్హులైన తెల్ల రేషన్ కార్డుదారులకు సకాలంలో వారి ఇంటి ముంగిటికే సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం రేషన్ డీలర్లు, ఎండీఓ ఆపరేటర్లు, వేర్ హౌసింగ్ గొడౌన్ ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బియ్యం పంపిణీలో ఎటువంటి సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.