News June 30, 2024
శ్రీకాకుళం: ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

ప్రయాణీకుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్ మీదుగా అగర్తల (AGTL), సికింద్రాబాద్(SC) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07029 AGTL- SC ట్రైన్‌ను జూలై 5 నుంచి అక్టోబర్ 4 వరకు, నెం. 07030 SC- AGTL ట్రైన్‌ను జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ ట్రైన్లు ఏపీలో విజయనగరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు తదితర స్టేషన్లలో ఆగుతాయి.
Similar News
News September 19, 2025
ఇచ్ఛాపురం: 100 ఏళ్లు జీవించి..మరొకరికి వెలుగునిచ్చారు

ఇచ్ఛాపురం పట్టణ మేజిస్ట్రేట్ పరేష్ కుమార్ అమ్మమ్మ విజయలక్ష్మి (100) గురువారం మృతి చెందారు. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావుకు తెలియజేశారు. ఓ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్స్ సుజాత, కృష్ణలు ఆమె కార్నియాను సేకరించారు.
News September 19, 2025
SKLM: 10 నుంచి 12 గంటల వరకే ఈ అవకాశం

ఇవాళ దివ్యాంగుల స్వాభిమాన్ గ్రీవెన్స్ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశంలో నిర్వహించనున్నట్లు జడ్పి సీఈఓ శ్రీధర్ రాజా తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12:00 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News September 19, 2025
ఎచ్చెర్ల: యూనివర్సటిలో సంస్కృతి కోర్సు ప్రారంభం

ఎచ్చెర్ల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటిలో సంస్కృతి కోర్సును వైస్ ఛాన్సలర్ ఆచార్య డాక్టర్ కే ఆర్ రజిని ఇవాళ ప్రారంభించారు. ఈ మేరకు జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పీఎం ఉష నిధుల ఆర్థిక సహకారంతో సంస్కృతంలో సర్టిఫికెట్ కోర్సును మొదలపెట్టామని చెప్పారు. సంస్కృతం భాష నుంచే మిగతా భాషలు వృద్ధి చెందాయని తెలియజేశారు.