News August 8, 2024

శ్రీకాకుళం: ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

image

ప్రయాణీకుల రద్దీ మేరకు శ్రీకాకుళం, పలాస మీదుగా తిరునల్వేలి – షాలిమార్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. నం.06087 TEN- SHM ట్రైన్‌ను ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 9 వరకు, నం.06088 SHM- TEN ట్రైన్‌ను ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 7 వరకు పొడిగించినట్లు SCR తెలిపింది. ఈ ట్రైన్‌లు ఏపీలో విజయనగరం, దువ్వాడ, రాజమండ్రి,విజయవాడ తదితర స్టేషన్లలో ఆగుతాయని పేర్కొంది.

Similar News

News November 24, 2025

శ్రీకాకుళం జిల్లాస్థాయి సంఘ సమావేశాల నిర్వహణ

image

శ్రీకాకుళం జిల్లా స్థాయి సంఘ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈఓ సత్యనారాయణ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రం నుంచి ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 29న ఈ సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. వివిధ స్థాయి సంఘాల ప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు. సమావేశాలకు అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో పాల్గొనాలని ఆదేశించారు.

News November 24, 2025

ఎచ్చెర్ల : మూడు కోర్సుల్లో జీరో అడ్మిషన్లు

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో మూడు కోర్సులను ప్రారంభించారు. జియో‌ఫిజిక్స్, జియాలజీ, ఫిలాసఫీ ఈ కోర్సుల్లో ఒక్క విద్యార్థి సైతం చేరలేదు. జాతీయ స్థాయిలో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో వీటిని మూసివేసిన ఇక్కడ ప్రారంభించడంపై నిపుణులు తప్పుపట్టారు. అధికారుల అవగాహన లేక ప్రారంభించారని విద్యావేత్తలు అంటున్నారు.

News November 24, 2025

ఎచ్చెర్ల: పాలకమండలి సమావేశం ఎప్పుడో..?

image

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీలో 2022 NOVలో పాలకమండలి చివరి సమావేశం జరిగింది. మూడేళ్లైనా..ఇప్పటికీ సమావేశం ఊసేలేదు. కనీసం ఆరు నెలలకోసారైన సమీక్ష జరగాలని విద్యావేత్తలు అంటున్నారు. పాలన, అకాడమిక్, అభివృద్ధి అంశాలపై చర్చలు జరుగుతాయి. ఈ మండలిలో ఉన్నతాధికారులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులతో 12 మంది ఉన్నారు. నిబంధనలు మేరకు మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలు తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు.