News September 17, 2024
శ్రీకాకుళం: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.O ప్రారంభం
కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.O కార్యక్రమాన్ని వర్చ్యువల్ విధానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో లబ్ధిపొందిన లబ్ధిదారులకు గృహ ప్రవేశాలకు సంబంధించి తాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గుండు శంకర్, నడికుడి ఈశ్వరరావు పాల్గొన్నారు.
Similar News
News October 5, 2024
ఆమదాలవలస: ‘ఖరీఫ్‌కు ఈ–పంట, ఈ కేవైసీ తప్పనిసరి’
ఖరీప్‌కు ఈ-పంట నమోదు, ఈకేవైసీ కార్యక్రమాన్ని రైతులు విధిగా చేయించుకోవాలని, ఆరోగ్యవంతమైన, నాణ్యమైన పంటలను పండించే దిశగా వారిని వ్యవసాయ అధికారులు కూడా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. ఆమదాలవలస మండలంలోని తొటాడ గ్రామంలో శనివారం ఖరీఫ్ వరికి ఈ పంట నమోదు కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన సర్వే నంబర్లలోని వరి పంట పొలాలను సంబంధిత అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
News October 5, 2024
శ్రీకాకుళం: హోంగార్డు కుటుంబానికి ఆర్థిక చేయూత
అనారోగ్యంతో మరణించిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక చేయూతగా నగదు చెక్కును జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి చేతుల మీదుగా శనివారం ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన హోంగార్డు జి సురేష్ సతీమణి దుర్గ భవానికి తోటి ఉద్యోగుల ఆర్థిక సహాయంగా స్వతహాగా ఇచ్చిన 4.29 లక్షల నగదు చెక్కును అందజేసి మానవత్వం చాటారు. పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.
News October 5, 2024
శ్రీకాకుళంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!
శ్రీకాకుళంలో శనివారం లీటర్ పెట్రోల్ ధర రూ.109.69గా ఉంది. నిన్నటితో(110.68)తో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. మరోవైపు, లీటర్ డీజిల్ ధర రూ.97.48గా ఉంది. ఇది కూడా నిన్నటి (98.39) ధర కంటే తగ్గింది. ఈనెల తొలి ఐదురోజుల్లో డీజిల్‌కు ఇదే అత్యల్ప ధర.