News June 19, 2024
శ్రీకాకుళం: ప్రయాణికులకు ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్

ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలో అయోధ్య, కాశీ వంటి పుణ్యక్షేత్రాలకు సులభంగా ప్రయాణించేలా ప్రత్యేక ప్యాకేజీ తీసుకువచ్చినట్లు ఐఆర్సీటీసీ రీజనల్ మేనేజర్ డాక్టర్ క్రాంతి తెలిపారు. శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. జూలై 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు దేశంలోని సుప్రసిద్ధం పుణ్యక్షేత్రాలకు రూ.16,525 టికెట్ ధరతో యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 8, 2025
శ్రీకాకుళం: తండ్రి మందలించాడని కుమారుడు నదిలో దూకేశాడు

శ్రీకాకుళం పట్టణంలో ఐటీఐ చదువుతున్న విద్యార్థి అలుగోలు సాయి నేతాజీ నాగావళి నదిలో శుక్రవారం అర్దరాత్రి దూకాడు. గుజరాతిపేట శివాలయం వీధికి చెందిన సాయి రాత్రి ఇంటికి ఆలస్యంగా రావడంతో తండ్రి మందలించారు. అనంతరం బయటకు వెళ్లి ఏడురోడ్ల వంతెనపై నుంచి నాగావళి నదిలో దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు.
News November 8, 2025
కనుమరుగైన బాలి యాత్ర..పున:ప్రారంభం వెనక కథ ఇదే

శ్రీముఖలింగంలో రేపు జరిగే బాలియాత్రకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 5 వేల ఏళ్ల క్రితం వదిలేసిన యాత్రను ఇటీవల ప్రారంభించారు. మహానది-గోదావరి వరకు గల కళింగాంధ్రాను ఖౌరవేలుడు పరిపాలించాడు. ఆయన కాలంలో శ్రీముఖలింగం ఆలయ సమీపాన వంశధార నది నుంచి వర్తకులు పంటలతో ఇండోనేషియాలో బాలికి వెళ్లేవారు. వారు క్షేమంగా రావాలని కార్తీక మాసంలో అరటి తెప్పల దీపాన్ని కుటుంబీకులు నదిలో విడిచిపెట్టడమే యాత్ర వృత్తాంతం.
News November 8, 2025
నరసన్నపేట: పంచలోహ విగ్రహాల అప్పగింత

నరసన్నపేటలోని సిద్ధాశ్రమంలో ఏడు పంచలోహ విగ్రహాలు చోరీకి గురైన విషయం తెలిసిందే. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్సై దుర్గాప్రసాద్ నిందితుడి వద్ద సమాచారం రాబట్టి, విగ్రహాలను సిద్ధాశ్రమ నిర్వాహకులకు శుక్రవారం రాత్రి అందజేశారు.


