News June 21, 2024

శ్రీకాకుళం: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే అధికారులు

image

పలాస, శ్రీకాకుళం మీదుగా డిబ్రుగఢ్(DBRG)- కన్యాకుమారి(CAPE) మధ్య ప్రయాణించే వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇకపై ప్రతి రోజు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.నెం .22504 DBRG – CAPE ట్రైన్‌ను జులై 8 నుంచి, నెం.22503 CAPE – DBRG ట్రైన్‌ను జులై 12 నుంచి ప్రతిరోజూ నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.

Similar News

News October 15, 2025

కలెక్టరేట్ నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణ పనులు డిసెంబరు నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి ఆయన కలెక్టరేట్‌ను పరిశీలించారు. ప్రజల పరిపాలనకు ఉపయోగపడే గదులన్నీ కింద ఫ్లోర్‌లో ఉండేలా, ఒక్కో శాఖకు కేటాయించే స్క్వేర్ ఫీట్‌ను నిర్ణయించి, గదులను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

News October 15, 2025

కళింగపట్నం బీచ్‌లో ఆకట్టుకున్న GST సైకత శిల్పం

image

సిక్కోలు జిల్లా కళింగపట్నం బీచ్‌లో ఏర్పాటు చేసిన జీఎస్టీ (GST) అంశంపై సైకత శిల్పం సందర్శకులను ఆకట్టుకుంటోంది. స్థానిక కళాకారుడు ఇసుకతో తీర్చిదిద్దిన ఈ శిల్పం, ప్రజల్లో పన్నుల వ్యవస్థపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో రూపొందించబడింది. సముద్ర తీరానికి వచ్చే పర్యాటకులు ఈ శిల్పం వద్ద ఫోటోలు తీసుకుంటూ ఆనందిస్తున్నారు.

News October 15, 2025

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కీలక సూచనలు

image

ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మందాకా చేరవేయడమే తమ ప్రధాన ధ్యేయమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల స్థాయి అధికారులతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత, వేగం పెంపుతో ప్రజల్లో సానుకూల అభిప్రాయం నెలకొల్పాలని సూచించారు. రెవెన్యూ ఫిర్యాదులు, కోర్టు కేసులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు.