News May 24, 2024

శ్రీకాకుళం: ప్రయాణికుల రద్దీ మేరకు బెంగుళూరుకు ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల మీదుగా SMVT బెంగుళూరు(SMVB), భువనేశ్వర్(BBS) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.06271 SMVB- BBS రైలును ఈ నెల 31న, నం.06272 BBS- SMVB రైలును జూన్ 2వ తేదీన నడుపుతామని తెలిపారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు చెప్పారు.

Similar News

News November 23, 2025

నేడు శ్రీకాకుళం రానున్న విజయసాయిరెడ్డి

image

వైసీపీ ఓడిపోయిన అనంతరం పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం వైసీపీ హయంలో పెద్ద ఎత్తున లిక్కర్‌ స్కాం జరిగిందని ఆరోపణలు చేసిన ఆయన బీజేపీలో చేరతారని వార్తలొచ్చినా అది జరగలేదు. అప్పటి నుంచి స్తబ్దుగా ఉన్న ఆయన ఆదివారం శ్రీకాకుళంలో జరిగే రెడ్డిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన ఏం మాట్లాడతారోనని ఆసక్తి నెలకొంది.

News November 23, 2025

బెల్జియం అమ్మాయి.. సిక్కోలు అబ్బాయి.. కట్ చేస్తే!

image

బెల్జియం దేశానికి చెందిన యువతి శ్రీకాకుళానికి చెందిన యువకునికి ఘనంగా వివాహం జరిగింది. శ్రీకాకుళం హయాతి నగర్‌కు చెందిన యువకుడు శ్రీ రంగనాథ సాహిత్ బెల్జియంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. తనతోపాటు పనిచేస్తున్న కెమిలీ మస్కర్‌తో పరిచయం ఏర్పడి ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో శ్రీకాకుళంలో శనివారం రాత్రి జరిగిన వివాహంతో వారిద్దరు ఒకటయ్యారు.

News November 23, 2025

శ్రీకాకుళం: దైవ దర్శనాలకు వెళ్తూ మృత్యుఒడిలోకి..!

image

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు వ్యాన్‌లో దైవ దర్శనాలకు వెళ్తూ <<18364371>>మృత్యుఒడిలోకి<<>> చేరుకున్నారు. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. అయోధ్య, కాశీ, పూరీ వంటి క్షేత్రాలు దర్శించుకున్న అనంతరం శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో గాయపడ్డ ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు.