News May 24, 2024
శ్రీకాకుళం: ప్రయాణికుల రద్దీ మేరకు బెంగుళూరుకు ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల మీదుగా SMVT బెంగుళూరు(SMVB), భువనేశ్వర్(BBS) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.06271 SMVB- BBS రైలును ఈ నెల 31న, నం.06272 BBS- SMVB రైలును జూన్ 2వ తేదీన నడుపుతామని తెలిపారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు చెప్పారు.
Similar News
News February 18, 2025
టెక్కలి : ప్రభుత్వ హాస్టళ్లో గర్భం దాల్చిన విద్యార్థిని

టెక్కలిలోని ఓ ప్రభుత్వ బాలికల వసతిగృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక విద్యార్థినికి టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ప్రసూతి వైద్య పరీక్షలు నిర్వహించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని గర్భం దాల్చిందనే ప్రచారం సోమవారం నాటికి బయటకు పొక్కడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News February 18, 2025
SKLM: అయోడిన్ లోపంపై అవగాహన అవసరం

శ్రీకాకుళం నగరంలోని DM&HO కార్యాలయంలో సోమవారం ఉదయం అయోడిన్ లోపంపై ఆశా వర్కర్లకు శిక్షణా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో DM&HO మురళి హాజరయ్యారు. జిల్లాలోని 4 మండలాల్లో 40 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా ప్రోగ్రామ్‌ను ITC ఆర్థిక సహాయంతో చేస్తున్న కార్యక్రమాలను ఆశావర్కర్లకు వివరించారు. అయోడిన్ లోపంతో వచ్చే అనర్థాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
News February 17, 2025
ఇచ్చాపురం: ఇటలీలో ఉద్యోగాలంటూ మోసం

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి తెరలేపారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది. పార్వతీపురానికి చెందిన ఓ ఏజెంట్‌తో కలిసి ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి వాసి ఈ మోసానికి పాల్పడ్డారు. జిల్లాలో ఒక్కొక్కరి నుంచి రూ.1.20 లక్షలు చొప్పున రూ.3 కోట్లకు పైగా వసూళ్లు చేశారు. దాదాపు 350 మంది నిరుద్యోగులను ఇటలీ పంపగా.. అక్కడ సరైన ఉద్యోగం లేక మోసపోయారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.