News August 31, 2024

శ్రీకాకుళం: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం, పలాస మీదుగా భువనేశ్వర్ (BBS), బెళగావి(BGM) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 7 నుంచి నవంబర్ 30 వరకు ప్రతి శనివారం BBS- BGM(నం.02813), సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రతి సోమవారం BGM- BBS(నం.02814) మధ్య నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం, విజయవాడ, గుంటూరుతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

Similar News

News November 27, 2025

యూరియా కొర‌త ఎట్టి పరిస్థితుల్లోనూ తలెత్త‌కూడ‌దు: మంత్రి అచ్చెన్న

image

ర‌బీ సీజ‌న్‌ను దృష్టిలో ఉంచుకుని యూరియా కొర‌త ఎట్టి పరిస్థితుల్లోనూ తలెత్త‌కూడ‌ద‌ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారుల‌ను ఆదేశించారు. గురువారం విజ‌య‌వాడ క్యాంప్ ఆఫీస్‌లో సంబంధిత అధికారులు స‌మీక్షా నిర్వ‌హించారు. ర‌బీకి అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా ఉండేలా ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్క‌డా కూడా ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు.

News November 27, 2025

SKLM: రేషన్ షాపుల్లో బియ్యానికి బదులు రాగులు పంపిణీ.!

image

జిల్లాలోని రేషన్ కార్డుదారులకు ఈనెల 27 నుంచి డిసెంబర్ నెల కోటాలో బియ్యం బదులుగా మూడు కిలోల వరకు రాగులు పంపిణీ చేయనున్నట్లు JC ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ కార్డుదారులకు డిసెంబర్ కోటాలో బియ్యానికి బదులుగా మూడు కిలోల వరకు ఉచితంగా రాగులు అందించాలన్నారు.