News May 26, 2024
శ్రీకాకుళం: ప్రశాంతంగా డిప్యూటీ డీఈవో పరీక్ష

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు శనివారం పరీక్ష నిర్వహించారు. జిల్లాలో నాలుగు కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆన్లైన్లో ఈ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాల (చిలకపాలెం)లో 100కు 68 మంది, వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల (ఎచ్చెర్ల)లో 100కు 72 మంది పరీక్ష రాశారు. నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ కేంద్రంలో 330 మందికి 233 మంది హాజరయ్యారు.
Similar News
News October 17, 2025
మెడిసిన్ ధరలు తగ్గుదలపై అందరికీ అవగాహన అవసరం: డీఎంహెచ్ఓ

ప్రజలు నిత్యం వినియోగించే మెడిసిన్ ధరలపై అవగాహన అవసరమని జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ కె. అనిత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీఎస్టీ సవరణల వలన మందులపై ధరలు 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గాయని ఆమె తెలిపారు. క్లినిక్లు, మెడికల్ షాపుల వద్ద తగ్గిన ధరల పట్టికలను బోర్డుల రూపంలో ప్రదర్శించాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News October 16, 2025
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సందర్శించిన నాగబాబు

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ను ఎమ్మెల్సీ నాగబాబు సందర్శించారు. కాంప్లెక్స్ ఆవరణలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వర్షపు నీరు నిల్వతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారడంపై ఆరా తీస్తున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందితో చర్చించారు. ఆయన వెంట సుడా ఛైర్మన్ కొరికాన రవికుమార్, నాయకులు ఉన్నారు.
News October 16, 2025
స్వచ్ఛంద్ర మరింత భాద్యతతో నిర్వర్తించాలి: కలెక్టర్

స్వచ్ఛంద్ర స్వచ్ఛభారత్ కార్యక్రమం మరింత బాధ్యతగా నెరవేర్చాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛభారత్ అవార్డు పొందిన నేలబొంతు గిరిజన బాలికల ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి విజయభారతికి అవార్డు లభించడం పట్ల ఆయన అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందజేసిన సర్టిఫికెట్ను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శ్రీకాకుళంలో బుధవారం అందజేశారు.