News December 7, 2024

శ్రీకాకుళం: ప్రాణం తీసిన ఇన్‌స్టా చాటింగ్

image

విశాఖ పీఎంపాలెంలో నిన్న ఒకరు సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం పట్టణానికి చెందిన హేమంత్ రెడ్డికి 2017లో వివాహం జరిగింది. డెలీవరీ బాయ్‌గా పనిచేసే అతడు భార్య(25)తో కలిసి పీఎంపాలెంలో ఉంటున్నారు. భార్య శుక్రవారం ఇన్‌స్టాగ్రాంలో ఒకరితో చాటింగ్ చేయడాన్ని గమనించి గొడవ పడ్డారు. ఈ విషయం అత్తమామలకు తెలిసి మందలించడంతో ఆమె మనస్తాపానికి గురైంది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది.

Similar News

News November 11, 2025

విశాఖపట్నంలో గార మండల యువకుడు ఆత్మహత్య

image

విశాఖపట్నంలో గార మండలం కొర్లాం గ్రామానికి చెందిన యువకుడు నల్ల సంపత్ కుమార్ (32) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థుల వివరాల మేరకు.. యువకుడు విశాఖ ద్వారక నగర్‌లో ఓ గదిలో అద్దెకి ఉంటూ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో మనస్థాపానికి గురైన అతను ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం అలముకుంది.

News November 11, 2025

ఆత్మహత్య ఘటనలో ఇద్దరికి రిమాండ్: ఎస్ఐ

image

నందిగం మండలం తురకలకోట గ్రామానికి చెందిన ఎం.వెంకటరావు(34) అనే వ్యక్తి శనివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు నందిగం పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటరావును వేధించిన పెట్రోల్ బంక్ యజమాని బీ.రమేశ్‌తో పాటు అతనికి సహకరించిన ఒక హెడ్ కానిస్టేబుల్ ఇరువురుని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నందిగం ఎస్ఐ షేక్ మహమ్మద్ అలీ తెలిపారు.

News November 11, 2025

SKLM: పిల్లలు దత్తత కావాలా.. ఐతే ఇలా చేయండి

image

అర్హులైన తల్లిదండ్రులు మిషన్ వాత్సల్య వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటే పిల్లలను చట్టబద్ధంగా దత్తత ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. సోమవారం ఆయన కార్యాలయంలో దత్తత ప్రక్రియపై కరపత్రాన్ని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని విమల ఆధ్వర్యంలో సోమవారం విడుదల చేశారు. www.missionvataslya.wcd.gov.in వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేయాలన్నారు.