News September 16, 2024

శ్రీకాకుళం: బదిలీపై జిల్లాకు ముగ్గురు డీఎస్పీలు

image

శ్రీకాకుళం జిల్లాకు బదిలీపై ముగ్గురు డీఎస్పీలు వస్తున్నట్లు ఆదివారం మంగళగిరి డీజీపీ కార్యాలయం నుంచి డీజీపీ ద్వారకాతిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారని ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. సీఐడీ డీఎస్పీగా ఉన్న ఎ.బి.జి. తిలక్ కాశీబుగ్గ డివిజన్‌కు, ఏఎన్టీఎఫ్ వెయిటింగ్ అటాచ్ గా ఉన్న డీఎస్పీ బి.రాజశేఖర్ శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్‌కు, వెయిటింగ్ డీఎస్పీగా ఉన్న ప్రసాద్ డీపీటీసీకి బదిలీపై రానున్నారన్నారు.

Similar News

News November 20, 2025

SKLM: ‘సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోండి’

image

సివిల్ సర్వీస్ ఉచిత కోచింగ్ పొందేందుకు నవంబర్ 25 లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 80 ఫీట్ రోడ్డులో గల బీసీ స్టడీ కార్యాలయంలో ధ్రువపత్రాలను సమర్పించిన అనంతరం డిసెంబర్ 5న వెరిఫికేషన్ స్క్రీన్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. కుల ప్రాతిపదిక పైన ఎంపికైన అభ్యర్థులకు డిసెంబర్ 10 నుంచి విజయవాడలోని గొల్లపూడి సర్కిల్లో ఉచిత కోచింగ్ ఇస్తారన్నారు.

News November 20, 2025

ఈ ఉద్యమమే టెక్ శంకర్‌ను మావోయిస్టుగా మార్చింది

image

మావోయిస్ట్ జోగారావు అలియాస్ టెక్ శంకర్ నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో స్వగ్రామం వజ్రపుకొత్తూరు(M)బాతుపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1988లోని పీపుల్స్ ఉద్యమంతో మావోయిస్టుల పార్టీలో చేరి 1995 DEC 1న ఒంగోలు మాజీ MP సుబ్బరామిరెడ్డిపై కాల్పుల కేసులో శంకర్‌ది కీలక పాత్రని సమాచారం. బాతుపురంలో స్తూపం ఆవిష్కరణకు గద్దర్‌ రాకతో రాష్ట్రంలో ఈయన పేరు మార్మోగింది.

News November 20, 2025

శ్రీకాకుళం జిల్లాలో రూ.25 వేల జీతంతో ఉద్యోగాలు

image

శ్రీకాకుళంలో రేపు జిల్లా ఉపాధి అధికారి ఆధ్వర్యంలో జరగనున్న జాబ్ మేళాకు చిక్కోల్ సోలార్ ఎనర్జీ సర్వీసెస్, శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్ కంపెనీలు హాజరుకానున్నాయి. టెన్త్-డిగ్రీ చదివిన పురుష అభ్యర్థులు ఈ మేళాకు అర్హులు. ఎంపికైన వారు శ్రీకాకుళం, నరసన్నపేటలో పని చేయాలని, రూ.15,000-25,000 జీతం ఇస్తారని ఆ శాఖాధికారి సుధా చెప్పారు. దరఖాస్తుకు https://WWW.NCS.GOV.IN వెబ్‌సైట్‌‌ను సంప్రదించాలన్నారు.