News September 24, 2024
శ్రీకాకుళం: బాణసంచా విక్రయాలపై అనుమతులు తప్పనిసరి
దీపావళి పండుగ నేపద్యంలో బాణసంచా పేలుళ్లు జరగకుండా శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ కేవి మహేశ్వర రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బాణసంచా నిల్వలు, విక్రయాలు తయారీకి అనుమతులు ఉన్న గోడౌన్లు, షాపులు వద్ద భద్రతా ప్రమాణాలు, రక్షణ చర్యలు పరిశీలించాలన్నారు. అనంతరం ఇతర శాఖల అధికారులతో జాయింట్ తనిఖీలు నిర్వహించి, అనుమతులు లేని వాటిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
Similar News
News October 9, 2024
శ్రీకాకుళం: నీటి సంఘాల ఎన్నికలకు సిద్ధం కావాలి
సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం ఆయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్‌తో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులతో చిన్న నీటి పారుదల ప్రాజెక్టుల వారీగా సాగునీటి సంఘాలకు వచ్చే నెల నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించారు. అందుకు తగ్గ ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలన్నారు.

News October 8, 2024
టెక్కలి: జ్వరంతో స్టాఫ్ నర్స్ మృతి
టెక్కలి జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.లక్ష్మీ(35)అనే మహిళ జ్వరంతో మంగళవారం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గత కొద్ది రోజులుగా డెంగీ జ్వరం లక్షణాలతో బాధపడుతున్న ఆమె మంగళవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది. మృతురాలిది నందిగం మండలం సుభద్రాపురం. స్టాఫ్ నర్స్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. మృతురాలికి భర్త మాధవరావు, ఇద్దరు కుమార్తెలున్నారు.