News June 6, 2024
శ్రీకాకుళం: బీఈడీ పరీక్షల టైం టేబుల్ విడుదల
ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో రెండేళ్ల బీఈడీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. జూలై 31 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, వివరాలకై విద్యార్థులు https://exams.andhrauniversity.edu.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని AU పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.
Similar News
News December 11, 2024
శ్రీకాకుళం: ఓబీసీ ప్రక్రియను వేగవంతం చేయాలి
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర లోని తూర్పుకాపు, కళింగవైశ్య, శిష్ఠకరణ, సొండి, అరవ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. దీనిపై గత 10 ఏళ్లుగా పార్లమెంటులో, ఎన్సీబీసీ కమిషన్‌లో పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. పలు కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాల్సిన ఆవశ్యకతను ఆయనకు వివరించారు. ఈ సమావేశంలో ఆయనతో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఉన్నారు.
News December 10, 2024
రణస్థలం: రెండు బైకులు ఢీ వ్యక్తి మృతి
రణస్థలంలోని పాత పెట్రోల్ బంకు సమీపంలో రెండు బైకులు ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల మేరకు జె.ఆర్‌పురంలో నివాసం ఉంటున్న విశ్రాంత ఉద్యోగి తలసముద్రపు పాటయ్య(67) బంకులో పెట్రోల్ కొట్టేందుకు బైక్‌పై సోమవారం వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో లావేరు రోడ్డుకు వస్తుండగా మరో ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో పాటయ్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
News December 10, 2024
దువ్వాడ శ్రీనివాస్‌పై ఒంగోలు PSలో ఫిర్యాదు
పవన్ కళ్యాణ్‌ని తమ రాజకీయ లబ్ధికోసం, జగన్ వద్ద మెప్పు పొందేందుకు అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెట్టిన వైసీపీ నాయకులపై తగు చర్యలు తీసుకోవాలని, ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రెపాటి అర్జునరావు అన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు, శ్రీరెడ్డి, మాజీ మంత్రి జోగి రమేశ్, పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని కోరారు.