News June 18, 2024

శ్రీకాకుళం: బీపీఈడీ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన బీపీఈడీ నాల్గవ సెమిస్టర్ (రెగ్యులర్ &సప్లిమెంటరీ) పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://results.andhrauniversity.edu.in/లో చెక్ చేసుకోవాలని ఆంధ్రా యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

Similar News

News December 3, 2025

ఎచ్చెర్ల: మహిళ హత్య?

image

ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట జాతీయ రహదారి పక్కన మంగళవారం రాత్రి మహిళ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఎస్సై లక్ష్మణరావు ఆధ్వర్యంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి పరిశీలన జరుపుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 3, 2025

శ్రీకాకుళం: అకడమిక్ ఇన్స్ట్రక్టర్స్ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

పాఠశాలల్లో అకడమిక్ ఇన్స్ట్రక్టర్స్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో ఎ.రవిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 24 పోస్టులు ఉన్నట్లు తెలిపారు. ఐదు నెలల కాలానికి పనిచేయవలసి ఉంటుందన్నారు. స్కూల్ అసిస్టెంట్లకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10 వేలు గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ నెల 5 లోపు ఎంఆర్సీల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News December 3, 2025

బూర్జలో 6 తులాల బంగారం, 23 తులాల వెండి చోరీ

image

శ్రీకాకుళం జిల్లాలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. బూర్జలోని ఓ ఇంటిలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. శనివారం సాయంత్రం స్థానికుడు రమేష్ కుటుంబంతో కలిసి అరకు వెళ్లారు. మంగళవారం ఉదయం తిరిగొచ్చేసరికి ఇంటి తాళాలు, బీరువా తెరిచి ఉన్నాయి. 6 తులాల బంగారం, 23 తులాల వెండి, రూ.1లక్ష నగదు చోరీకి గురైనట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.