News March 10, 2025
శ్రీకాకుళం: భక్తులకు నేడు నిరాశే మిగిలింది..!

అరసవల్లి సూర్యభగవానుడు రెండో రోజు కూడా భక్తులను కరుణించలేదు. వాతావరణం మబ్బులతో ఉండటంతో సూర్యకిరణాలు ఆదివారం ఆదిత్యుడిని తాకలేదు. దీంతో ఎంతో ఆశతో దర్శనానికి వచ్చిన భక్తులకు నిరాశే ఎదురైంది. రెండో రోజు సోమవారం కూడా మంచు, మబ్బులు కారణంగా భానుడు ఆదిత్యుని పాదాలు తాకలేదు.
Similar News
News October 25, 2025
SKLM: ‘ఎలక్ట్రోరల్ రోల్స్ నమోదుపై సూచనలు ఇవ్వాలి’

ఎలక్ట్రోరల్ రోల్స్ నమోదుపై సూచనలు, సలహాలు ఇవ్వాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను DRO ఎం. వెంకటేశ్వరరావు కోరారు. కలెక్టరేట్లో పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఎలక్ట్రోరల్ రోల్స్ నమోదు, తొలగింపుల పై సమాచారం అందించాలన్నారు. రాజకీయ పార్టీల సూచనలు, సలహాలు ఎంతో దోహదం చేస్తాయన్నాయని తెలియజేశారు. ఫారం-6, 7, 8ల సమాచారం ఇవ్వాలని కోరారు.
News October 25, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

★ఇంటి పన్నుల వసూళ్లపై దృష్టి సారించండి: అచ్చెన్న
★గార: నవంబర్ 2న కూర్మనాధుని తెప్పోత్సవం
★బూర్జ: రైతులు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న డ్రోన్ సర్వేపై నిరసన
★హరిపురం PHCని తనిఖీ చేసిన ఎమ్మెల్యే శిరీష
★త్వరలో సీబీఎస్ఈ పాఠశాల ఏర్పాటు: శ్రీకాకుళం ఎమ్మెల్యే
★2029 నాటికి ప్రతీ ఇంటికీ ఒక ఉద్యోగం: పాతపట్నం ఎమ్మెల్యే
★ఆమదాలవలస: 20 కోట్లతో కన్నతల్లికి గుడి
News October 24, 2025
తిలారు: రైలు ఢీకొని ఒకరు మృతి

తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో డౌన్ లైన్లో రైలు ఢీకొని శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ హెచ్సీ మధుసూదనరావు తెలిపారు. మృతుడికి 45 ఏళ్లు ఉంటాయాని, నీలం రంగు హాఫ్ హాండ్స్ షర్ట్, నలుపు రంగు జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు. రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని తెలియజేశారు. ఆచూకీ తెలిసినవారు 91103 05494 నంబర్ను సంప్రదించాలన్నారు.


