News June 24, 2024
శ్రీకాకుళం: భర్తను హత్య చేసిన భార్య

ఎచ్చెర్ల మండలం కుప్పిలిలో దారుణం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం గ్రామానికి చెందిన కుప్పయ్యను ఆయన భార్య హారమ్మ కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. గతేడాది కుప్పయ్య తన కుమారుడిని చంపి జైలులో ఉన్నాడు. ఇటీవలే ఆయన బెయిల్పై బయటికి వచ్చాడు. ఈ క్రమంలో గ్రామానికి వచ్చిన కుప్పయ్యను రాత్రి హారమ్మ కత్తితో హత్య చేసింది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News December 1, 2025
పలాస: యాక్సిడెంట్.. యువకుడుకి తీవ్ర గాయాలు

పలాస మండలం సున్నాడ గ్రామ జంక్షన్ సమీప రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సైకిల్పై వెళ్తున్న ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
News December 1, 2025
శ్రీకాకుళం: ‘దిత్వా తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి’

దిత్వా తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాను ప్రభావంతో సోమవారం నుంచి భారీ ఏపీకి వర్ష సూచన ఉందని తెలిపారు. ప్రధానంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని తమ పంటలను కాపాడుకోవాలని కోరారు.
News December 1, 2025
శ్రీకాకుళం: రహదారి భద్రతను మెరుగుపరచడంపై చర్యలు

జిల్లాలో రహదారి భద్రతను మెరుగుపరచడం, ప్రమాదాలను తగ్గించడం, ప్రజలకు ఇబ్బంది కలిగించే బహిరంగ మద్యం తాగడం, పబ్లిక్ న్యూసెన్స్పై ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 17,509 పైగా డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు కాగా.. వీటిలో 8,594 వేలకి పైగా కేసులు కోర్టుల ద్వారా శిక్షలు, జరిమానాల రూపంలో డిస్పోజ్ అయ్యాయని ఎస్పీ చెప్పారు.


