News May 4, 2024
శ్రీకాకుళం: భానుడి ప్రతాపానికి ప్రధాన రహదారులు ఖాళీ

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, దీర్ఘ రోగాలు గల వారి పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. భానుడి ప్రతాపంతో ఆమదాలవలస మండల పరిధిలో ప్రధాన రహదారులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వేసవిలో శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం ఎండలో బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News November 24, 2025
శ్రీకాకుళం జిల్లాస్థాయి సంఘ సమావేశాల నిర్వహణ

శ్రీకాకుళం జిల్లా స్థాయి సంఘ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈఓ సత్యనారాయణ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రం నుంచి ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 29న ఈ సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. వివిధ స్థాయి సంఘాల ప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు. సమావేశాలకు అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో పాల్గొనాలని ఆదేశించారు.
News November 24, 2025
ఎచ్చెర్ల : మూడు కోర్సుల్లో జీరో అడ్మిషన్లు

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మూడు కోర్సులను ప్రారంభించారు. జియోఫిజిక్స్, జియాలజీ, ఫిలాసఫీ ఈ కోర్సుల్లో ఒక్క విద్యార్థి సైతం చేరలేదు. జాతీయ స్థాయిలో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో వీటిని మూసివేసిన ఇక్కడ ప్రారంభించడంపై నిపుణులు తప్పుపట్టారు. అధికారుల అవగాహన లేక ప్రారంభించారని విద్యావేత్తలు అంటున్నారు.
News November 24, 2025
ఎచ్చెర్ల: పాలకమండలి సమావేశం ఎప్పుడో..?

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీలో 2022 NOVలో పాలకమండలి చివరి సమావేశం జరిగింది. మూడేళ్లైనా..ఇప్పటికీ సమావేశం ఊసేలేదు. కనీసం ఆరు నెలలకోసారైన సమీక్ష జరగాలని విద్యావేత్తలు అంటున్నారు. పాలన, అకాడమిక్, అభివృద్ధి అంశాలపై చర్చలు జరుగుతాయి. ఈ మండలిలో ఉన్నతాధికారులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులతో 12 మంది ఉన్నారు. నిబంధనలు మేరకు మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలు తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు.


