News May 4, 2024

శ్రీకాకుళం: భానుడి ప్రతాపానికి ప్రధాన రహదారులు ఖాళీ

image

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, దీర్ఘ రోగాలు గల వారి పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. భానుడి ప్రతాపంతో ఆమదాలవలస మండల పరిధిలో ప్రధాన రహదారులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వేసవిలో శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం ఎండలో బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Similar News

News November 2, 2024

ఎచ్చెర్ల: డిగ్రీ 3, 5 సెమిస్టర్ల ప్రాక్టికల్ షెడ్యూల్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 3, 5 సెమిస్టర్ల ప్రాక్టికల్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు వర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ జి.పద్మారావు విడుదల చేశారు. ఈ సందర్భంగా నవంబర్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్, నవంబర్ 18 నుంచి 23వ తేదీ వరకు 3వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ జరుగుతాయన్నారు. జిల్లాలో 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలను నియమించారు.

News November 2, 2024

శ్రీకాకుళం జిల్లా మీదుగా స్పెషల్ ట్రైన్

image

శ్రీకాకుళం జిల్లా మీదుగా విశాఖ-దానాపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రైస్ (08520) రైలును నవంబర్ 4న నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు శ్రీకాకుళం రోడ్డు, పలాస స్టేషన్లలో ఆగనుంది. శ్రీకాకుళం రోడ్డుకు ఉదయం 11 గంటలకు, పలాస స్టేషన్‌కు మ.12:30 గంటలకు రానుంది. దానాపూర్-విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ ప్రైస్ (08519) రైలు నవంబర్ 5న బయలుదేరి ఇది పలాస స్టేషన్‌కి ఉ.11:52కి, శ్రీకాకుళం రోడ్డుకు మ.12:57కి రానుంది.

News November 2, 2024

SKLM: జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

image

శ్రీకాకుళం పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం జిల్లా అభివృద్ధిపై చర్చలు జరిపారు. జిల్లాకు కావాల్సిన నిధులు, పెండింగ్ పనులపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు జిల్లా అభివృద్ధికి పలు సూచనలు చేశారు. సీఎంతో పాటుగా మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ఉన్నారు.