News June 4, 2024
శ్రీకాకుళం: ముందంజలో ఎంపీ అభ్యర్థి రామ్మోహన్

శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముందంజలో దూసుకుపోతున్నారు. పార్లమెంట్ పరిధిలోని 4వ రౌండ్లకు రామ్మోహన్ నాయుడుకు 1,38,991 ఓట్లు పోలవ్వగా.. ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్కు 79,423 ఓట్లు పడ్డాయి. దీంతో టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 59,568 ఓట్ల మెజారిటీతో ముందుకు సాగుతున్నారు.
Similar News
News October 15, 2025
కళింగపట్నం బీచ్లో ఆకట్టుకున్న GST సైకత శిల్పం

సిక్కోలు జిల్లా కళింగపట్నం బీచ్లో ఏర్పాటు చేసిన జీఎస్టీ (GST) అంశంపై సైకత శిల్పం సందర్శకులను ఆకట్టుకుంటోంది. స్థానిక కళాకారుడు ఇసుకతో తీర్చిదిద్దిన ఈ శిల్పం, ప్రజల్లో పన్నుల వ్యవస్థపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో రూపొందించబడింది. సముద్ర తీరానికి వచ్చే పర్యాటకులు ఈ శిల్పం వద్ద ఫోటోలు తీసుకుంటూ ఆనందిస్తున్నారు.
News October 15, 2025
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కీలక సూచనలు

ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మందాకా చేరవేయడమే తమ ప్రధాన ధ్యేయమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల స్థాయి అధికారులతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత, వేగం పెంపుతో ప్రజల్లో సానుకూల అభిప్రాయం నెలకొల్పాలని సూచించారు. రెవెన్యూ ఫిర్యాదులు, కోర్టు కేసులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు.
News October 15, 2025
SKLM: అధికారులకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచనలు

ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మం దాకా చేరవేయడమే తమ ప్రధాన ధ్యేయమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత, వేగం పెంపుతో ప్రజల్లో సానుకూల అభిప్రాయం నెలకొల్పాలని సూచించారు. రెవెన్యూ ఫిర్యాదులు, కోర్టు కేసులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు.