News September 27, 2024

శ్రీకాకుళం: ‘ముద్దాయిలకు ఉచిత న్యాయ సేవలు’

image

శ్రీకాకుళం కారగరంలో ముద్దాయిలకు న్యాయ అవగాహన సదస్సును గురువారం నిర్వహించామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. జైలు ముద్దాయిలకు ఉచిత న్యాయసేవలు అందిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ముద్దాయిలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేసులు విషయంలో రాజీ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని అవగాహన కల్పించారు. రాజియే రాజమార్గం అన్నారు. సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News October 18, 2025

ఎచ్చెర్ల: డిగ్రీ 5వ సెమిస్టర్ షెడ్యూల్ విడుదల

image

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ఐదవ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను యూనివర్సిటీ డీన్ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరీక్ష ఫీజులను ఎటువంటి అపరాధ రుసుము లేకుండా అక్టోబర్ 31వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని తెలిపారు. ఈ పరీక్షలు నవంబర్ చివరి వారంలో జరుగుతాయని వెల్లడించారు.

News October 18, 2025

బాణసంచా దుకాణాల వద్ద జాగ్రత్తలు తప్పనిసరి: కలెక్టర్

image

బాణసంచా దుకాణాల వద్ద పటిష్ట భద్రత, జాగ్రత్తలు తప్పనిసరిగా చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. శనివారం సాయంత్రం టెక్కలిలో పర్యటించిన ఆయన ముందుగా దీపావళి సామాగ్రి దుకాణాలను పరిశీలించారు. అనంతరం టెక్కలిలో జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈయనతో పాటు ఆర్డీఓ కృష్ణమూర్తి, తహశీల్ధార్ సత్యం, ఎంపీడీఓ రేణుక, ఈఓ శ్రీనివాసరావు తదితరులున్నారు.

News October 18, 2025

SKLM: రాష్ట్రస్థాయి విజేతగా శ్రీకాకుళం సన్‌రైజర్స్

image

విజయవాడలో రాష్ట్ర పాఠశాలల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి లీప్ క్రికెట్ టోర్నమెంట్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సన్‌రైజర్స్ జట్టు మొదటి బహుమతి సాధించింది. కృష్ణాజిల్లా విజయం జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఎస్.ఎస్.ఏ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు (ఐఏఎస్) శనివారం విజేతలకు ట్రోఫీలు అందజేశారు. బహుమతి గెలిచిన జిల్లా జట్టును డీఈఓ రవిబాబు అభినందించారు.