News June 2, 2024

శ్రీకాకుళం: మూడు రోజులు మద్యం దుకాణాలు బంద్

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఈ నెల 3, 4, 5 తేదీల్లో మూడు రోజులు మద్యం దుకాణాలను మూసి వేయనున్నట్లు ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక పోలీస్ అధికారి జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ( ఎస్ఈబీ) అదనపు ఎస్పీ డి.గంగాధరం తెలిపారు. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశామని చెప్పారు. కౌంటింగ్ సమయంలో ఎక్కడ మద్యం అక్రమ నిల్వలు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 30, 2025

శ్రీకాకుళం: ’65 హాట్‌స్పాట్‌ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి’

image

శ్రీకాకుళం జిల్లాలో గంజాయి వినియోగం, అక్రమ రవాణాను సమూలంగా అరికట్టేందుకు అధికారులు గుర్తించిన 65 హాట్‌స్పాట్‌ల వద్ద సీసీ కెమెరాలను తక్షణమే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌‌లో జిల్లా నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమవేశం నిర్వహించారు. కెమెరాల ఏర్పాటు బాధ్యతను స్థానిక సంస్థలు తీసుకోవాలని చెప్పారు.

News November 30, 2025

అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేయాలి: శ్రీకాకుళం ఎస్పీ

image

డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో లోక్ అదాలత్ కేసులు తోపాటు బెయిల్స్, రానున్న ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. స్వీయ ఒప్పందంతో రాజీకి ప్రోత్సహించాలని తెలిపారు. అదనపు ఎస్పి కెవి రమణ ఉన్నారు.