News July 25, 2024
శ్రీకాకుళం: యథేచ్ఛగా పశువుల రవాణా.. చేతులు మారుతున్న కోట్లు
ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధి ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మూగ జీవాల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఒకప్పుడు వారాంతపు సంతలో మాత్రమే పశువుల క్రయ విక్రయాలు జరిగేవి. నేడు ప్రతి రోజూ దళారులు జీవాలను కబేళాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఈ అక్రమ రవాణాలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న పశు రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.
Similar News
News October 4, 2024
జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు నరసన్నపేట విద్యార్థి
జాతీయస్థాయిలో ఢిల్లీలో జరగనున్న ఫుట్‌బాల్ పోటీలకు నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని పుష్పలత ఎంపికైందని ప్రిన్సిపల్ పి లత, పిఈటీ భోగేశ్ గురువారం తెలిపారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో ఆమె గెలుపొందిందని వివరించారు. ఢిల్లీ నోయిడా లో ఈనెల 9 నుంచి 16వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటుందన్నారు.
News October 4, 2024
నరసన్నపేట కానిస్టేబుల్ మృతి UPDATE
నరసన్నపేట ఎక్సైజ్ ఆఫీసులో కానిస్టేబుల్ మోహనరావు గురువారం (33) ఆకస్మికంగా మృతిచెందిన విషయం తెలిసిందే. కుటుంబీకుల వివరాలు.. అతను ఇటీవలే పాతపట్నానికి బదిలీ అయ్యారు. గురువారం తన కార్యాలయంలో రిలీవ్ అయి పాతపట్నానికి బస్సులో బయల్దేరారు. అప్పటికే అతనికి జ్వరంగా ఉంది. దీంతో అస్వస్థతకు గురయ్యారు. ప్రయాణికులు ఆసుపత్రిలో చేర్పించగా ..చికిత్స పొందుతూ కన్నుమూశాడని తెలిపారు.మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు.
News October 4, 2024
2047నాటికి సంపన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
స్వర్ణాంధ్ర-2047 సాధనకు అందరి భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. జిల్లాలో ఆర్థిక, సామాజిక, సాంకేతికంగా వృద్ధి చెందడానికి తగిన సూచనలు సేకరణకు వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. గురువారం కలెక్టరేట్‌లో జేసీతో కలసి ఈ కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 2047 నాటికి సంపన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలవాలని, ఇందుకు అందరి సహకారం అవసరమన్నారు.