News December 13, 2024

శ్రీకాకుళం: యువకుడి జీవితానికి ‘ది ఎండ్’

image

శ్రీకాకుళం జిల్లా IIITలో <<14862988>>చనిపోయిన <<>>ప్రవీణ్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేవాడు. ఇటీవల కాస్త డల్‌ అయ్యాడు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడలేదు. మూడు రోజుల కిందట ‘ది ఎండ్’ అని మెయిల్లో రాశాడు. బుధవారం రాత్రి 12 గంటల వరకు చదువుకున్నాడు. తర్వాత బయటకు వెళ్తుండగా ఫ్రెండ్స్ చూసి ఎక్కడికి అని ప్రశ్నించారు. వాష్ రూముకు వెళ్తున్నా అని చెప్పి బిల్డింగ్‌ పైనుంచి దూకేశాడు. ‘నన్ను తీసుకెళ్లండి’ అన్నవే ప్రవీణ్ చివరి మాటలు.

Similar News

News January 16, 2025

వంగర: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

పార్వతీపురం మండలం నర్సిపురం శివారులో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వంగరలో కొట్టిశకు చెందిన లొలుగు. రాంబాబు(41), మోక్ష శివం (7) కుటుంబంతో బైక్‌పై రామభద్రపురంలోని అత్తవారింటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో లారీ బలంగా ఢీకొనడంతో రాంబాబు, పెద్ద కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. చిన్న కుమారుడు, భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News January 16, 2025

 శ్రీకాకుళం: రేపు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్

image

శ్రీకాకుళంలో ప్రతి నెల మూడో శుక్రవారం నిర్వహిస్తున్న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమం ఈ నెల 17వ తేదీ జరగనుంది. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వినతుల స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ సహాయ సంచాలకులు కె.కవిత పేర్కొన్నారు.

News January 16, 2025

సిక్కోలు రచయిత్రికి ఐదోసారి జాతీయ పురస్కారం

image

సమీక్షకురాలిగా, సామాజికవేత్తగా రాణిస్తున్న యువ రచయిత్రి, కోస్టా సచివాలయం మహిళా పోలీస్ అమ్మోజీ బమ్మిడి ఐదోసారి జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు తెలుగు అసోసియేషన్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు గురువారం అమ్మోజీకి ఆహ్వానపత్రాన్ని అందజేశారు. జనవరి 21న విజయవాడలో ప్రముఖుల చేతుల మీదుగా అమ్మోజీ తెలుగుతేజం అవార్డుతోపాటు రూ.10 వేలు అందుకోనున్నారు. ఆమె “అమ్మూ” కలం పేరుతో రచనలు చేస్తున్నారు.