News July 28, 2024

శ్రీకాకుళం: యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం

image

యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా నైపుణ్యాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్లపై చర్చించేందుకు కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

Similar News

News February 23, 2026

శ్రీకాకుళం: ప్రయాణికులకు గమనిక

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే భువనేశ్వర్-బెంగళూరు-భువనేశ్వర్ (రైలు నం.18463/64) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు 3వ ఏసీ భోగిని అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలు శ్రీకాకుళం రోడ్డు, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం తదితర రైల్వే స్టేషన్లలో ఆగనుంది.

News February 23, 2026

శ్రీకాకుళం: ‘ఇంటర్ పరీక్షకు 662 మంది డుమ్మా’

image

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం మొదటి రోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 662 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఆర్ఐఓ ఆర్.సురేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 71 కేంద్రాల్లో 20,377 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 19,715 మంది హాజరైనట్లు తెలిపారు. 96.75 హాజరు శాతం నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు. మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరుగినట్లు, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదన్నారు.

News February 23, 2026

ఎర్రన్నాయుడు నాకు అత్యంత ఆప్తుడు: సీఎం చంద్రబాబు

image

కింజరాపు ఎర్రన్నాయుడు తనకు అత్యంత ఆప్తుడు అని సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం Xలో పోస్ట్ చేశారు. ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని నివాళులు అర్పించారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా వ్యవహరించిన ఎర్రన్న చివరి క్షణం వరకు ప్రజా సేవలో ఉన్నారని చంద్రబాబు కొనియాడారు.