News June 19, 2024
శ్రీకాకుళం యువతకు గుడ్‌న్యూస్

శ్రీకాకుళం పట్టణంలోని నెహ్రూ యువ కేంద్రంలో శుక్రవారం జూన్ 21న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ బుధవారం తెలిపారు. 10, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన యువత వివిధ కంపెనీలు నిర్వహించే ఇంటర్వ్యూలకు ఉదయం 10 గంటలలోగా హాజరు కావాలని ఆమె కోరారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో రావాలన్నారు. WWW.NCS.GOV.IN వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 8, 2026
శ్రీకాకుళం: ‘ప్రేమించి.. ఉద్యోగం వచ్చాక ముఖం చాటేశాడు’

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఉద్యోగం వచ్చాక ముఖం చాటేస్తున్నాడని హిరమండలం భగీరదపేటకు చెందిన ఓ యువతి వాపోయింది. ఈ మేరకు శనివారం హిరమండలంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలతో కలిసి మౌనదీక్ష చేపట్టింది. భామిని మండలం సింగిడి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు తనని కొన్నేళ్లుగా ప్రేమించి తీరా ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోమంటే చేసుకోను అంటున్నాడని తెలిపింది. పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరింది.
News March 8, 2026
శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి

కంచిలి మండలం బొనమాలి గ్రామానికి చెందిన బీ.బాలకృష్ణ (29) అనే ఆర్మీ జవాన్ శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన బంధువు పెళ్లి పిలుపులు కోసం ఒరిశా ప్రాంతానికి బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా కొత్త శాసనం వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనలో మరో ఇద్దరు గాయపడగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 8, 2026
శ్రీకాకుళం: ‘రైతులు 365 రోజులు సాగుకు ప్రాధాన్యత నివ్వాలి’

రైతులు 365 రోజులు సాగుకు ప్రాధాన్యత నివ్వాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనజర్ పూజారి సత్యనారాయణ అన్నారు. శ్రీకాకుళం, రణస్థలం, నరసన్నపేట పరిధిలో ఉన్న ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎఫ్ఎంటీఎస్‌కు శ్రీకాకుళంలోని నైరాలో శనివారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కూరగాయలు, ఆకుకూరలు, ఉద్యాన వన పంటల సాగుతో ఏడాది పాటు రైతులకు ఆదాయం వస్తుందని చెప్పారు.


