News March 25, 2024
శ్రీకాకుళం: రూ.రెండు లక్షల నగదు, కారు సీజ్
సరుబుజ్జిలి మండలం అమృతలింగానగరం వద్ద కారులో తరలిస్తున్న రెండు లక్షల రూపాయల నగదు, కారును సీజ్ చేసినట్లు ఎస్సై బి.నిహార్ తెలిపారు. బూర్జ, సరుబుజ్జిలి మండలాలకు సంబంధించిన 2024 సాధారణ ఎన్నికల ఫ్లయింగ్ స్క్యాడ్ టీమ్ -1 సోమవారం తనిఖీలు నిర్వహిస్తుండగా హిరమండలానికి చెందిన రత్నాల రమ మోహనరావు బిల్లులు లేకుండా తరలిస్తున్న సొమ్మును పట్టుకున్నట్లు ఎస్సై చెప్పారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News September 9, 2024
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు: ఎస్పీ
శ్రీకాకుళంలో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ (మీకోసం) వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించుట లేదని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల తీవ్రత కారణంగా రద్దు చేయడం జరిగిందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News September 8, 2024
వంశధార, నాగావళి నదులకు వరద పెరిగే అవకాశం ఉంది: సీఎంఓ
శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదులకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదివారం రాత్రి సీఎంఓ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రవాహంపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని సమీక్షించాలని సీఎం నారా చంద్రబాబునాయుడు అధికారులను కోరారు. జిల్లా ఉన్నతాధికారులు వరద ప్రవాహాంపై క్షేత్రస్థాయిలో సమీక్షిస్తున్నారు.