News February 25, 2026

శ్రీకాకుళం: రెండు వారాల వ్యవధిలో ఇద్దరు కమిషనర్లు అవుట్..!

image

శ్రీకాకుళం నగరపాలక సంస్థ పాలనా యంత్రాంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెండు వారాల వ్యవధిలో ఇద్దరు కమిషనర్లపై వేటు పడింది. ఒకరు బదిలీ కాగా.. మరొకరిపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో నగర పాలక సంస్థ కమిషనర్‌గా పనిచేసిన దుర్గా ప్రసాద్ రెండు వారాల కిందట ఆకస్మికంగా బదిలీపై వెళ్లారు. ప్రస్తుత కమిషనర్ కూర్మారావు వచ్చి 2 వారాలు గడవక ముందే డయేరియా నేపథ్యంలో సస్పెన్షన్ ఎదుర్కొన్నారు.

Similar News

News April 20, 2026

శ్రీకాకుళం జిల్లాలో రేపు పీజీఆర్ఎస్

image

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్‌ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.

News April 19, 2026

శ్రీకాకుళం: అసలు సూత్రధారులెవరో..?

image

ఈ ఏడాది రథసప్తమి వేడుకల్లో నకిలీ పాసుల వ్యవహారం వెలుగులోకొచ్చిన విషయం తెలిసిందే. వీటి ముద్రణలో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి<<19679785>> ఆరుగురిపై<<>> కేసు నమోదు చేశారు. అసలు ఈ పాసులను ముద్రించమన్నదెవరూ? ఇవి బయటికెలా వచ్చాయనే విషయాలను వెల్లడించకపోవడంతో అసలు నిందితులను రాజకీయ ఒత్తిడితో దాచిపెట్టారనే ఆరోపణలోస్తున్నాయి. తెర వెనక పాత్రదారులను పట్టుకోవాలని భక్తుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.