News July 13, 2024

శ్రీకాకుళం: ‘రెండో శనివారం సెలవు లేదా? అయితే ఫిర్యాదు చేయండి’

image

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలలు రెండో శనివారం సెలవు దినం పాటించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం తెలిపారు. సెలవు ప్రకటించని పక్షంలో ఆయా పాఠశాల, కళాశాలలపై apscpcr2018@gmail.com మెయిల్ ఐడీ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

Similar News

News October 13, 2024

శ్రీకాకుళం: డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

image

SC, STఅభ్యర్థులకు డీఎస్సీ పరీక్ష కోసం మూడు నెలలు పాటు అర్హులైన మెరిట్ అభ్యర్థులకు రాష్ట్రంలో శిక్షణ పొందుటకు అవకాశం ఉందని కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. దీని కోసం http://jnanabhumi.ap.gov.in ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 11 నుంచి 21 వరకు మాత్రమే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News October 13, 2024

SKLM: మద్యం సీసా గుచ్చుకొని యువకుడి మృతి

image

శ్రీకాకుళం జిల్లాలో ఘోరమైన ఘటన జరిగింది. మెళియాపుట్టి మండలం మురికింటిభద్ర గ్రామానికి చెందిన సవర సురేశ్(28) మద్యం తాగి బైకుపై వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడ్డాడు. అప్పటికే మద్యం బాటిళ్లను కడుపులో ఉంచుకొని డ్రైవ్ చేస్తుండటంతో.. అవి పగిలిపోయాయి. సీసా పగిలి కడుపులో గుచ్చుకుంది. తీవ్రంగా గాయపడటంతో సురేశ్ మృతి చెందాడు. ఘటనపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 12, 2024

శ్రీకాకుళం: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి?

image

దసరా పండుగ అనగానే పల్లె గుర్తుకొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, స్నేహితులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. పల్లెల్లో తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.