News July 11, 2024
శ్రీకాకుళం: రెండో సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో Msc జాగ్రఫీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. జులై 27-ఆగస్టు 2వ తేదీ మధ్య జరగనున్న ఈ పరీక్షలను మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ వర్శిటీ పరీక్షల విభాగం ఆయా కేంద్రాలలో నిర్వహించనుంది. సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ వివరాలకై https://exams.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.
Similar News
News February 12, 2025
శ్రీకాకుళం: రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య

వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేసి, సేవలు మరింత సులభతరం చేసే సంకల్పంతో ప్రభుత్వం రైతులకు 14 అంకెలతో కూడిన ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య (యూనిక్ ఐడి) ఆధార్ కార్డు తరహాలో అందించనున్నదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో సొంత భూమి కలిగిన ప్రతి రైతుతోనూ ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తి చేయించాలన్నారు.
News February 11, 2025
శ్రీకాకుళం: క్రీడా పోటీల్లో ప్రథమ స్థానం

రాష్ట్ర పీఈటి సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో జరిగిన సెమినార్, క్రీడా పోటీలలో శ్రీకాకుళం జిల్లా హ్యాండ్ బాల్ జట్టు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో గెలుపొందిన జట్టుకు మంగళవారం జిల్లా కేంద్రంలో డీఈవో, తిరుమల చైతన్య, డిప్యూటీ డిఈవో విజయ కుమారి అభినందించారు. క్రీడా పోటీల్లో ప్రథమ స్థానం రావడం గర్వంగా ఉందన్నారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు.
News February 11, 2025
శ్రీకాకుళం: టెన్త్ అర్హతతో 34 ఉద్యోగాలు

శ్రీకాకుళం డివిజన్ పరిధిలో 34 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. >Share it