News March 17, 2026

శ్రీకాకుళం: రేపటి నుంచి దివ్యాంగులకు ఉచిత ప్రయాణం

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపటినుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నామని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి అప్పలనారాయణ తెలిపారు. మంగళవారం శ్రీకాకుళంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, 40 శాతానికి పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులందరికీ ఈ పథకం వర్తింప చేస్తామన్నారు. అయితే సంబంధిత దివ్యాంగులు శ్రీకాకుళం, టెక్కలి, పలాస ఆర్టీసీ బస్టాండ్‌లో మూడు సంవత్సరాలకు ఒక పాస్‌ను పొందవలసి ఉంటుందన్నారు.

Similar News

News April 20, 2026

శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

image

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

image

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.