News April 5, 2024
శ్రీకాకుళం: రేపటి నుంచి పాఠశాలల్లో వార్షిక పరీక్షలు
జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలో వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఈ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఈనెల 19వ తేదీతో ముగియనున్నాయి. ప్రశ్న పత్రాలు మండల రిసోర్స్ కార్యాలయం నుంచి పాఠశాల సముదాయాలకు.. అక్కడ నుంచి సంబంధిత పాఠశాలకు ఈ ప్రశ్న పత్రాలు వెళతాయని అధికారులు తెలిపారు.
Similar News
News January 17, 2025
SKLM: ‘దివ్యాంగులను ప్రోత్సహించాలి’
దివ్యాంగులలో సృజనాత్మకతను వెలికితీసి వారిని ప్రోత్సహించాలని, వారు ఎందులోనూ తీసిపోరని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ మండలాల నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి, జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి కవితతో కలసి వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని తెలిపారు.
News January 17, 2025
పలాస: సముద్ర స్నానానికి వెళ్లి యువకుడు గల్లంతు
పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన జంగం తరుణ్(16) శుక్రవారం సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. బయటకు రాకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పండగ సెలవులకు సరదాగా గడుపుతున్న సమయంలో ఇలా జరగడం బాధాకరమని స్థానికులు అన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
News January 17, 2025
శ్రీకాకుళం: నేడు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్
శ్రీకాకుళంలో ప్రతి నెల మూడో శుక్రవారం నిర్వహిస్తున్న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనునట్లు ఆ శాఖ సహాయ సంచాలకులు కె.కవిత తెలిపారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.