News August 31, 2024
శ్రీకాకుళం: రేపు అండర్ -9 చదరంగం పోటీలు

శ్రీకాకుళం జిల్లా చదరంగం అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల ఒకటో తేదీన అండర్-9 విభాగంలో బాలలకు చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు బగాది కిశోర్ తెలిపారు. 2015 జనవరి 1 తరువాత జన్మించిన క్రీడాకారులు అర్హులన్నారు. శ్రీకాకుళం నగరంలోని నానుబాల వీధిలోని చదరంగం శిక్షణ కార్యాలయానికి 9 గంటలకు హాజరుకావాలని సూచించారు.
Similar News
News November 25, 2025
కంచిలి: విషాదం.. 8నెలల గర్భిణి మృతి

మరో నెల రోజులు గడిచి ఉంటే ఆమెకు పండంటి బిడ్డ పుట్టేది. అమ్మగారితో పాటు అత్తగారింట్లో చిన్నారి అడుగులు పడేవి. ఇంతలోనే విషాదం నెలకొంది. బయటి ప్రపంచంలోకి రాకముందే తల్లితో పాటు ఆ శిశువు కన్నుమూసింది. కంచిలి(M) అర్జునాపురానికి చెందిన ధనలక్ష్మి(26) 8నెలల గర్భిణి. నిన్న రాత్రి పురిటి నొప్పులొచ్చాయి. 108కు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి తరలిస్తుండగా బిడ్డతో సహా ధనలక్ష్మి ప్రాణాలొదిలింది.
News November 25, 2025
పలాస జిల్లా లేనట్లేనా..?

పలాస కేంద్రంగా ఉద్దానం ఏరియాను జిల్లాను చేయాలనే డిమాండ్ ఇక్కడి ప్రజల్లో ఉంది. గత ప్రభుత్వం పలాసను జిల్లా చేస్తామని ప్రకటించినప్పటికీ.. కేవలం రెవెన్యూ డివిజన్గా మార్చి వదిలేసింది. జిల్లాగా ప్రకటించకపోవడంతో పలాసతో పాటు ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈప్రభుత్వంలోనైనా ఏర్పాటు అవుతుందని అందరూ భావించారు. దీనిపై అసలు చర్చే లేకపోవడంతో జిల్లా లేనట్టేనని తెలుస్తోంది.
News November 25, 2025
జాతీయస్థాయి పోటీలకు సిక్కోలు విద్యార్థిని ఎంపిక

జి.సిగడం కేజీబీవీ ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థిని ఆర్.స్వాతి జాతీయస్థాయి పరుగు పందేనికి ఎంపికైంది. హర్యానాలో ఈ నెల 26 నుంచి 30 వరకు అండర్-19 క్యాటగిరీలో 4×100 రిలే పరుగు పందెంలో పాల్గొననుంది. రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రదర్శనతో జాతీయస్థాయికి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రమీల తెలిపారు. విద్యార్థినిని ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.


