News August 17, 2024
శ్రీకాకుళం: రేపు జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలు బంద్
రేపు జిల్లా వ్యాప్తంగా 24 గంటలు పాటు వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. కోల్‌కత RCKAR ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలిపై జరిగిన పాశవిక హత్యాచారానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేతృత్వంలో 24 గంటలు శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు IMD ఓ ప్రకటన విడుదల చేసింది.
Similar News
News September 10, 2024
SKLM: 15 మంది ఎస్సైలకు బదిలీ
శ్రీకాకుళం జిల్లాలో 15 మంది ఎస్.ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మహేశ్వరరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా విశాఖ రేంజ్ పరిధిలో 9 మంది సీఐలకు బదిలీలు కాగా, అందులో ఇద్దరిని శ్రీకాకుళం జిల్లాకు కేటాయించారు. ప్రస్తుతం విశాఖపట్నం వీఆర్‌లో ఉన్న వి.నాగరాజును శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీసుస్టేషన్, జి.ఆర్.కె. తులసీదాసు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి బదిలీ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
News September 10, 2024
SKLM: విపత్తు నిర్వహణ బృందంలో చేరుటకు ఆహ్వానం
రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా విపత్తు నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేస్తోందని సేవ చేయాలనుకునే వారు చేరవచ్చని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు ఒక ప్రకటనలో తెలిపారు. పేర్లు నమోదు చేసు కున్న వారికి శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు విపత్తుల సమయంలో సేవ చేయాల్సి ఉంటుందని చెప్పారు. వివరాలకు 99486 33398, 90102 73741, 99633 99455 నంబర్లను సంప్రదించాలని కోరారు.
News September 10, 2024
శ్రీకాకుళం: వర్షాలు తగ్గినా అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
వర్షాలు తగ్గుముఖం పట్టినా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుంచి ఆయన జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఒడిశాలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా చేయాలన్నారు.