News September 15, 2024

శ్రీకాకుళం: రేపు ఫిర్యాదులు స్వీకరణ రద్దు

image

రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ (మీకోసం) వినతుల స్వీకరణ కార్యక్రమం లేదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న మీకోసం వినతుల స్వీకరణ కార్యక్రమం రేపు మిలాదిన్ నబీ ప్రభుత్వ సెలవు దినం సందర్భంగా వినతుల స్వీకరణ కార్యక్రమం సెప్టెంబరు 16న నిర్వహించడం లేదని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News October 10, 2024

దువ్వాడ మీదుగా విజయవాడ – శ్రీకాకుళానికి ప్రత్యేక రైలు

image

దసరా రద్దీ దృష్ట్యా విజయవాడ – శ్రీకాకుళం రోడ్ మధ్య దువ్వాడ మీదుగా కొన్ని రోజుల పాటు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబర్ 07215 ఈనెల 10, 11,12,14,15,16,17 తేదీల్లో విజయవాడలో రాత్రి 8 గంటలకు బయలుదేరి శ్రీకాకుళం రోడ్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలునంబర్ 07216 ఈనెల 10,11,12,13,15,16,17,18 తేదీల్లో శ్రీకాకుళం రోడ్డులో ఉదయం 6.30కి బయలుదేరి విజయవాడ చేరుతుంది.

News October 10, 2024

కలెక్టర్, ఎస్పీతో చర్చించిన ఎంపీ కలిశెట్టి

image

విజయనగరం పైడితల్లి ఉత్సవాల నిర్వహణపై భక్తుల సలహాలు సూచనలు కోసం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం డయల్ యువర్ ఎంపీ కార్యక్రమం చేపట్టారు. అనంతరం భక్తులు తెలిపిన అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ అంబేడ్కర్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌తో చర్చించారు. అమ్మవారి ఉత్సవాలకు ఈ ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

News October 9, 2024

శ్రీకాకుళం: డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఉదయ్ భాస్కర్ షెడ్యూల్ విడుదల చేశారు. విద్యార్థులు ఈనెల 20వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని. ప్రాక్టికల్స్ ఈ నెల 29 నుంచి నవంబర్ 2 వరకు జరుగుతాయన్నారు. పరీక్షలు నవంబర్ మొదటి వారం నుంచి ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.