News January 16, 2025
శ్రీకాకుళం: రేపు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్

శ్రీకాకుళంలో ప్రతి నెల మూడో శుక్రవారం నిర్వహిస్తున్న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమం ఈ నెల 17వ తేదీ జరగనుంది. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వినతుల స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ సహాయ సంచాలకులు కె.కవిత పేర్కొన్నారు.
Similar News
News February 15, 2025
పలాస : రైలులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

తిరుపతి – పూరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ ఎస్కే షరీఫ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే 9440627567 నంబరుకు సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించామన్నారు.
News February 15, 2025
రణస్థలం : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న జేసీ

రణస్థలం మండలం పైడి భీమవరం ఇసుక తనిఖీ కేంద్రం వద్ద 28 లారీలను జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు. అందులో 12 లారీలు నకిలీ బిల్లులతో రవాణా అవుతున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆయా లారీలను సీజ్ చేయాలని జేసీ ఆదేశించారు. అనంతరం వాటిని మైన్స్ అండ్ విజిలెన్స్ అధికారులకు అప్పగించారు. ఈ తనిఖీలో తహశీల్దార్ ఎన్ ప్రసాద్, ఎస్సై చిరంజీవి, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.
News February 15, 2025
ఎచ్చెర్ల: నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం.. యువకుని మృతి

ఎచ్చెర్ల జాతీయ రహదారిపై కుశాలపురం బైపాస్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సవర నవీన్ (21) మృతి చెందారు. బైక్‌పై శ్రీకాకుళం వైపు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ వెనుక కూర్చున్న కళ్యాణి అనే యువతికి గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఎస్సై సందీప్ కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.