News May 24, 2024
శ్రీకాకుళం: రేపే పరీక్ష.. 830 మందికి 4 కేంద్రాలు

APPSC ఆధ్వర్యంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఈనెల 25వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు శుక్రవారం పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో 830 మంది అభ్యర్థులు ఏపీపీఎస్సీ పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని పోలీసులకు సూచించారు.
Similar News
News October 31, 2025
SKLM: ‘పోటీ పరీక్షలకు మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ’

మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనారిటీ అభ్యర్థులకు ఎస్.ఐ, కానిస్టేబుల్, టెట్, డీఎస్సీ ఉద్యోగాల కోసం ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు ED కె.కుమారస్వామి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విజయనగరం శ్రీకాకుళం, మన్యం, పార్వతీపురం జిల్లాల్లో ఆసక్తి గల అభ్యర్థులు https://apcedmmwd.org వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News October 30, 2025
SKLM: పోలీస్ కుటుంబానికి రూ.కోటి అందజేత

శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న జగదీష్ కుటుంబానికి రూ.కోటిలను ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి గురువారం ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. ఈ ఏడాది జూన్ నెలలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వారా ఈ నష్టపరిహారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంజూరు చేసిందని SP పేర్కొన్నారు. ఖాతాలకు పోలీస్ శాలరీ ప్యాకేజ్ అనుసంధానం చేసుకోవాలన్నారు.
News October 30, 2025
కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఏఎన్ఎం మృతి

కొత్తూరు మండలం కడుమ సచివాలయంలో పనిచేస్తున్న ఏఎన్ఎం మాలతీబాయి (48) రోడ్డు ప్రమాదంలో గురువారం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఒడిస్సా రాష్ట్రం కాశీనగరంలో నివాసం ఉంటూ ప్రతిరోజూ విధులకు కడుమ సచివాలయానికి ద్విచక్ర వాహనంపై వస్తుంటారు. ఇవాళ విధులకు వస్తుండగా అదుపుతప్పి ప్రమాదానికి గురై మాలతీ బాయి మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


