News May 12, 2024

శ్రీకాకుళం: రేపే పోలింగ్.. ఈ నంబర్లు మీకోసమే

image

జిల్లాలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేశామని, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ మనజీర్ జీలాని సమూన్ తెలిపారు. ☞ జిల్లాలో మొత్తం ఓటర్లు- 18,92,457 మంది ☞ పోలింగ్ కేంద్రాలు- 2,358 ☞ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు- 520 ☞ పోలింగ్ రోజు ఎక్కడైనా సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్- 18004256625 ☞ ఓటర్లకు సంబంధించిన సమాచారం కోసం – 1950

Similar News

News February 13, 2025

వాసుదేవు పెరుమాళ్ బ్రహ్మోత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం

image

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందసలో ఈ నెల 17వ తేదీ నుంచి శ్రీ వాసుదేవుని పెరుమాళ్ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆలయ ప్రధాన అర్చకులతో కలిసి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో మందస గ్రామ పెద్దలు కూటమి నాయకులు పాల్గొన్నారు.

News February 12, 2025

శ్రీకాకుళం: మరణంలోనూ వీడని బంధం..!

image

యాదృచ్ఛికమో, దైవ నిర్ణయమో కానీ ఒకే రోజు వీరి వివాహం జరిగింది. మరణం కూడా ఒకేరోజు గంటల వ్యవధిలో సంభవించింది. ఒకేరోజు అనారోగ్యంతో బావ, బామ్మర్ది మృతి చెందిన విషాదకర సంఘటన మందస మండలంలో చోటుచేసుకుంది. సార సోమేశ్వరరావు (58) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా, మరోవైపు కొర్రాయి నారాయణరావు (58) కూడా సోమేశ్వరరావు మృతి చెందిన కొన్ని గంటల్లోనే అనారోగ్యంతో ప్రాణాలు విడిచాడు.

News February 12, 2025

నందిగాం: హత్యకు గురైన తహశీల్దార్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

image

నందిగాం గ్రామానికి చెందిన రమణయ్య విశాఖపట్నంలో తహశీల్దారు విధులు నిర్వహిస్తూ గతేడాది ఫిబ్రవరి 2న హత్యకు గురయ్యారు. ఈ మేరకు ఆయన సతీమణి అనూషకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కారుణ్య నియామక పత్రాన్ని బుధవారం అందజేశారు. హత్యకు గురైన సమయంలో మంత్రికి అనూష విన్నపం చేశారు. అప్పట్లో మంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి డిప్యూటీ తహశీల్దార్‌గా నియామక పత్రం అందించారు.

error: Content is protected !!