News May 10, 2024

శ్రీకాకుళం: రేపే LAST.. గెలుపుపై మీ కామెంట్..?

image

ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం రేపటితో ముగియనుంది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. రేపటి సాయంత్రంతో ఆ క్రతువు ముగియనుంది. ఐదేళ్ల పాలనకు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి. మన శ్రీకాకుళం జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది..?

Similar News

News October 22, 2025

పొందూరు: ‘100% దివ్యాంగుడిని..పింఛన్ ఇచ్చి ఆదుకోండి’

image

తన దైనందిక జీవితంలో రోజు వారి పనులకు తల్లిదండ్రులపైనే ఈ దివ్యాంగుడు ఆధారపడాల్సిన పరిస్థితి. పొందూరు(M) తండ్యాం పంచాయతీ బొట్లపేట గ్రామానికి చెందిన మేకా నవీన్ కుమార్‌ 100 శాతం దివ్యాంగుడు. సదరం సర్టిఫికెట్ ఉన్నప్పటికీ పింఛన్ రావడం లేదు. అధికారులు స్పందించి పెన్షన్ మంజూరయ్యేలా చూడాలని కుటుంబీకులు కోరుతున్నారు.

News October 22, 2025

శ్రీకాకుళం: ‘గుర్తు తెలియని వ్యక్తి మృతి’

image

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఈ నెల 19న ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో 108 అక్కడికి చేరుకుంది. అనంతరం అతడిని శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దీనిపై సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు స్థానిక పోలీసు స్టేషన్ సంప్రదించాలన్నారు.