News August 28, 2024
శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా ప్రయాణించే నం.22643 పాట్నా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 2 నుంచి 23 వరకు విజయవాడ- ఏలూరు- తాడేపల్లిగూడెం మీదుగా కాక విజయవాడ- గుడివాడ మార్గం గుండా ఈ ట్రైన్ నిడదవోలు చేరుకుంటుందని రైల్వే అధికారులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News December 10, 2025
సిక్కోలు నేతల మౌనమేలనో..?

ఇండిగో సంక్షోభంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఇండిగో సంక్షోభానికి రామ్మోహన్ నాయుడే కారణమని ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ తదితరులు కేంద్ర మంత్రిపై విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై జిల్లాలో అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు పెద్దగా స్పందించకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతుంది.
News December 10, 2025
ఇండిగో సంక్షోభంపై సిక్కోలు నేతలు మౌనం

ఇండిగో సంక్షోభంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును వైసీపీ టార్గెట్ చేస్తుంది. ఇండిగో సంక్షోభానికి రామ్మోహన్ నాయుడే కారణమని ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాధ్ తదితరులు కేంద్ర మంత్రిపై విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై జిల్లాలో అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు పెద్దగా స్పందించకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతుంది.
News December 10, 2025
శ్రీకాకుళం మహిళ దారుణ హత్య

పెందుర్తిలోని సుజాతనగర్లో మహిళను కుర్చీతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శ్రీకాకుళానికి చెందిన దేవి, శ్రీనివాస్ సుజాతనగర్లో రూమ్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు మధ్య శనివారం రాత్రి వివాదం చోటుచేసుకోగా ఆమెను హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై పెందుర్తి సీఐ సతీశ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇటీవల శ్రీనివాస్ రైస్ పుల్లింగ్ కేసులో అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు.


