News April 3, 2025
శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు శుభవార్త

శ్రీకాకుళం, పలాస మీదుగా హైదరాబాద్(HYD)- కటక్(CTC) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నం.07165 HYD- CTC రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం, నం.07166 CTC- HYB మధ్య నడిచే రైలును ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం నడుస్తుందన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.
Similar News
News April 14, 2025
శ్రీకాకుళంలో సైనిక్ భవన్ శంకుస్థాపన

శ్రీకాకుళం కేంద్రంలో రాగోలులో సైనిక్ భవన్ నిర్మాణం సోమవారం జరిగింది. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భూమి పూజలకు హాజరై శంకుస్థాపన చేశారు. వీరితో పాటు ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు, మాజీ సైనకులు పాల్గొన్నారు.
News April 14, 2025
శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థిని

శ్రీకాకుళం ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహం-4 లో చదువుతున్న విద్యార్థిని చెన్నంశెట్టి జ్యోతికి ఇంటర్మీడియట్ MLTలో 984 మార్కులు సాధించినట్లు సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, శ్రీకాకుళం డివిజన్ అధికారి జి.చంద్రమౌళి సోమవారం తెలిపారు. హాస్టల్ నుంచి ఇంటర్ సెకండియర్‌లో 13మందికి 900 కు పైగా, ఫస్ట్ ఇయర్‌లో 11 మంది విద్యార్థులకు 450కి పైగా మార్కులు వచ్చాయన్నారు.
News April 14, 2025
శ్రీకాకుళం: నదిలో పడవపై నుంచి జారిపడి మత్స్యకారుడి మృతి

శ్రీకాకుళం రూరల్ మండలం గనగళ్లవానిపేట మొగ వద్ద నాగావళి నదిలో పడవపై నుంచి జారిపడి మత్స్యకారుడు మృతి చెందిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే గనగళ్లవానిపేట గ్రామానికి చెందిన పుక్కళ్ల గణేశ్ (40) ఆదివారం చేపల వేటకు పడవపై వెళ్లి ఆయన జారిపడ్డాడు. ఎడమ చేతికి తాడు కట్టుకొని ఉండడం వలన వల లాగడంతో ఒడ్డుకు చేరలేక నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ శ్రీకాకుళం రూరల్ ఎస్సై రాము కేసు నమోదు చేశారు.