News April 29, 2024
శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో జవాన్‌కు తీవ్ర గాయాలు

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం పాగోడు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నేతింటి వైకుంఠరావు ఆదివారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు. తన ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం నుంచి విశాఖ వెళ్తుండగా.. విజయనగరం జిల్లా తగరపువలస సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News April 16, 2026
కోటబొమ్మాళి: యాక్సిడెంట్‌లో 38 ఏళ్ల యువకుడు స్పాట్ డెడ్

కోటబొమ్మాళి మండలం జాతీయ రహదారి పాకివలస సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో కూరగాయల వ్యాపారి మృతి చెందాడు. బైక్‌పై కూరగాయలను అమ్ముకొని తిరిగొస్తుండగా వెనక నుంచి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడు పొన్నాడ పేటకు చెందిన మురళి (38)గా గుర్తించారు. ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు.
News April 16, 2026
మెళియాపుట్టి: భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు

భార్యను నాటు తుపాకీతో చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ గురువారం సోంపేట అదనపు జడ్జి కె.కిషోర్ బాబు తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి తెలిపారు. మెళియాపుట్టి మండలం భరణికోట గ్రామానికి చెందిన సవర పద్మ అనే మహిళను ఆమె భర్త జగ్గారావు 2021 అక్టోబర్ 21న నాటు తుపాకీతో కాల్చి చంపాడు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు తెలిపారు.
News April 16, 2026
నరసన్నపేట: ‘ముద్దాయిలకు న్యాయవాదులను ఏర్పాటు చేస్తాం’

నరసన్నపేటలోని స్థానిక సబ్ జైలును జిల్లా న్యాయాధికార సేవా సంస్థ కార్యదర్శి హరిబాబు ఆకస్మికంగా పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం సబ్ జైలుకు చేరుకున్న ఆయన ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ..బెయిల్ కోసం ప్రయత్నం చేసే ముద్దాయిలకు న్యాయాధికారి సేవా సంస్థ తరఫున ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో సబ్ జైలు సూపరింటెండెంట్ వినయ్ కుమార్ ఉన్నారు.


