News May 26, 2024

శ్రీకాకుళం: ర్యాంకుల వారీగా పాలిసెట్ ధ్రువపత్రాల పరిశీలన

image

జిల్లాలో రేపటి నుంచి పాలిసెట్ సర్టిఫికేట్లను పరిశీలించనున్నారు. మే 27 తేదీన 1 నుంచి 12 వేల లోపు, 28 తేదీన 12,001 నుంచి 27 వేల లోపు, 29 తేదీన 27,001 నుంచి 43 వేలు లోపు, 30 తేదీన 43,001 నుంచి 59 వేల లోపు, 31 తేదీన 59,001 నుంచి 75 వేలు, జూన్‌ 1 తేదీన 75,001 నుంచి 92,000 వరకు, 2 తేదీన 92,001 నుంచి 1,08,000 వరకు, జూన్ 3 తేదీన 1,08,001 నుంచి చివరి ర్యాంకు వచ్చిన అభ్యర్థులు పరిశీలనకు హాజరుకావాలి.

Similar News

News February 15, 2025

కంచిలి: గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్

image

కంచిలి మండల కేంద్రంలోని సోంపేట రైల్వేస్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను శుక్రవారం సాయంత్రం కంచిలి ఎస్సై పారినాయుడు పట్టుకున్నారు. వీరి నుంచి 2 కేజీల గంజాయి, 2 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ముందస్తు సమాచారం మేరకు తనిఖీల్లో భాగంగా ఒడిశా రాష్ట్రం సుర్లా నుంచి తరలిస్తుండగా ముగ్గురిని పట్టుకున్నామని తెలిపారు. వీరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

News February 15, 2025

టెక్కలి: మృతుడి వివరాలు ఇవే..!

image

టెక్కలిలోని ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత మంచినీటి ప్రాజెక్ట్ ట్యాంకులో శుక్రవారం సాయంత్రం మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే ప.గో జిల్లా పాలకొల్లు ప్రాంతానికి చెందిన చందనాలస్వామి(36) అనారోగ్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. టెక్కలి సమీపంలోని ఒక ఇంజినీరింగ్ కళాశాల మెస్‌లో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

News February 15, 2025

శ్రీకాకుళం: ‘ట్రాఫిక్ నియమాలు పాటించండి’

image

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ జరిగింది. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం 1,2 డిపో మేనేజర్లు అమర సింహుడు, శర్మ పాల్గొన్నారు. అనంతరం ప్రయాణీకులతో పాటు ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ రూల్స్ ప్రతి బక్కరూ పాటించాలని, నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. 

error: Content is protected !!