News December 3, 2024
శ్రీకాకుళం: ల్యాబ్ టెక్నీషియన్ గోండు మురళి సస్పెన్షన్
ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై ఏసీబీకి చిక్కిన ల్యాబ్ టెక్నీషియన్ గొండు మురళిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లుగా జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి కల్యాణ్ బాబు ప్రకటించారు. బుడితి CHCలో పని చేస్తున్న మురళీ ఇంటిపై ఇటీవల ACB దాడి చేసింది. రూ.50 కోట్ల అక్రమాస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేసింది. కోర్టు ఆయనకు DEC 12 వరకు రిమాండ్ విధించింది. ఈయన గతంలో ధర్మాన కృష్ణదాస్ వద్ద పీఏగా పని చేశారు.
Similar News
News December 27, 2024
రేపు అంబేడ్కర్ యూనివర్సిటీ సెలవు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతూ శనివారం ఎచ్చర్ల డా.బీ.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి సెలవును ప్రకటిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు వివరాలు వెల్లడించారు. విశ్వవిద్యాలయంతో పాటు యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలకు కూడా సంతాప దినంగా శనివారం సెలవును ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.
News December 27, 2024
SKLM: నెమలి పింఛంపై కనకమహాలక్ష్మి దేవి చిత్రం
శ్రీకాకుళం నగరానికి చెందిన వాడాడ రాహుల్ పట్నాయక్ శుక్రవారం నెమలి పింఛంపై వేసిన కనకమహాలక్ష్మీ దేవి చిత్రం ఆకట్టుకుంది. రాహుల్ ఇటీవల జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో చిత్రాలకు ఎన్నో పురస్కారాలు పొందారు. పక్షుల వెంట్రుకలపై శ్రీనివాస కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీకృష్ణ రాసలీల తదితర దేవతల చిత్రాలు వేశారు. పాఠశాలల గోడలపై ఎన్నో విద్యా సంబంధిత బొమ్మలు వేసి పలువురు ప్రశంసలు పొందారు.
News December 27, 2024
SKLM: మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించాలి
మానవ అక్రమ రవాణా ఎంతగానో వేధిస్తుంది దీని ద్వారా ఎంతోమంది అమాయకుల జీవితాలు బలి అవుతున్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్. సన్యాసినాయుడు అన్నారు. శుక్రవారం న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో వీధి బాలల భిక్షాటన, మానవ అక్రమ రవాణా, పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులపై చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్, మహిళా పోలీసులతో సమీక్ష నిర్వహించారు.