News July 22, 2024

శ్రీకాకుళం: వర్షాల కారణంగా పలు రైళ్ల దారి మళ్లింపు

image

కొత్తవలస-కిరండూల్ రైల్వే మార్గంలో భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు దారి మళ్లించారు. నం.18514 విశాఖపట్నం-కిరండూల్ ఎక్స్‌ప్రెస్, నం.18513 కిరండూల్ -విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లు అరుకు మీదుగా వెళ్లేవి. వీటిని ముందస్తు జాగ్రత్తగా రాయగడ, విజయనగరం మీదుగా ఈనెల 24 వరకు కొనసాగిస్తారు. రైళ్లు కిరండూల్ వరకు వెళ్లకుండా దంతేవాడ నుంచి రాకపోకలు సాగిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.

Similar News

News November 17, 2025

బుడితి: ఈ హాస్పిటల్‌లో ఏం జరుగుతుంది.. గర్భిణుల మృతితో అలజడి

image

అది ఒక ప్రభుత్వ ఆసుపత్రి.. ఇటీవల కాలంలో ఆ హాస్పిటల్లో గర్భిణులు శస్త్ర చికిత్స అనంతరం మృతి చెందడం కొనసాగుతుంది. దీనిపై అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదో అర్థం కావడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. సారవకోట మండలం బుడితి సీహెచ్సీలో గతంలో ఒకేరోజు ఇద్దరు గర్భిణులు మృతి చెందారు. తాజాగా శనివారం మరో గర్భిణి మృతి చెందింది. దీనిపై అధికారులు సమగ్రంగా విచారించి చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు.

News November 17, 2025

SKLM: ‘కుష్టు వ్యాధిపై సర్వేకు 2,234 బృందాలు నియమించాం’

image

కుష్టు వ్యాధిపై సర్వే‌కు జిల్లా వ్యాప్తంగా 2,234 బృందాలను నియమించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదనపు DMHO డాక్టర్ తాడేల శ్రీకాంత్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో కుష్టు వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నవంబర్ 17-31 వరకు ఈ వ్యాధిపై ఆశా కార్యకర్త, వాలంటీర్‌లు రోజుకు 20 గృహాల్లో సర్వే నిర్వహిస్తారన్నారు. స్పర్శ లేని మచ్చలను గుర్తించాలని ఆయన వారికి చెప్పారు.

News November 16, 2025

కన్నా లేవారా.. కన్నీటి రోదన మిగిల్చిన నీటి కుంట

image

కళ్లెదుట ఉన్న పిల్లలు నీటి కుంటలో పడి కానారాని లోకాలకెళ్లారని కన్నవారు జీర్ణించుకోలేకపోయారు. కన్నా..లేవరా అంటూ..చిన్నారుల మృతదేహాలపై పడి కన్నవారి కన్నీటి రోదనకు..ఊరంతా వేదనలో పడింది. వివరాల్లోకి వెళ్తే.. సంతబొమ్మాళి(M) పంటిగుంటకు చెందిన అవినాష్(9), సుధీర్(8)లు ఆదివారం సాయంత్రం నీటి కుంటలో స్నానానికి దిగి ..ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు. దీనిపై SI సింహాచలం కేసు నమోదు చేశారు.