News April 28, 2024

శ్రీకాకుళం వాసి.. హైదరాబాద్‌లో మృతి

image

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని నడగాం గ్రామానికి చెందిన తమరాపు లక్ష్మణరావు (40) విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లిన లక్ష్మణరావు ఓ ప్రైవేటు కంపెనీలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం విధి నిర్వహణలో విద్యుత్ షాక్‌‌తో చనిపోయాడు. శనివారం విషయం తెలియడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

Similar News

News November 9, 2024

శ్రీకాకుళం జిల్లాలో TODAY TOP NEWS

image

* శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 900 సీసీ కెమెరాలు: SP
* కోటబొమ్మాళి: టీడీపీ ప్రభుత్వం 400 మందిని తొలగించింది: పేరాడ తిలక్
* శ్రీకాకుళం జిల్లాకు ఇద్దరు డీఎస్పీల నియామకం
* ధాన్యం సేకరించిన 48 గంటల్లో నగదు జమ: మంత్రి అచ్చెన్న
* చట్ట పరిధిలోని ఫిర్యాదులను పరిష్కరిస్తాం: SP
* కంచిలిలో రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు
* ITEP 2వ సెమిస్టర్ టైం టేబుల్ విడుదల

News November 9, 2024

శ్రీకాకుళం: ఫిర్యాదుల నమోదు కోసం టోల్ ఫ్రీ నంబర్

image

మాదక ద్రవ్యాల వినియోగం, వాటికి సంబంధించిన ఫిర్యాదుల నమోదు, అలాగే డి-అడిక్షన్ కేంద్రాల సేవలకు టోల్ ఫ్రీ నెంబర్ 14446 పని చేస్తోందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం జరిగిన (ఎన్‌సీఓఆర్‌డీ) సమావేశంలో తెలిపారు. రిమ్స్ ఆసుపత్రిలో డి-అడిక్షన్ సెంటర్‌ అందుబాటులో ఉందన్నారు. దాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలపై కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు.

News November 8, 2024

రహదారి ప్రయాణంలో భద్రతే జీవితానికి రక్షణ: శ్రీకాకుళం కలెక్టర్

image

రహదారి ప్రయాణంలో భద్రతే జీవితాలకు రక్షణగా నిలుస్తుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కమిటీ ఛైర్మన్‌గా, జిల్లా ఎస్పీ కెవి.మహేశ్వర రెడ్డి, కమిటీ మెంబర్ కన్వీనర్, డీటీసీ విజయ సారథి తదితరులు హాజరయ్యారు.