News June 12, 2024
శ్రీకాకుళం: విజయనగరంపై విశాఖ జట్టు విజయం

టెక్కలిలో జరుగుతున్న అండర్-23 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో రెండో రోజు విజయనగరం-విశాఖ జట్లు మధ్య మ్యాచ్ జరగగా విశాఖ జట్టు గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన విశాఖ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 338 పరుగులు చేయగా తదుపరి బ్యాటింగ్ చేసిన విజయనగరం జట్టు 274 పరుగులకు ఆలౌట్ అయ్యారు. దీనితో 64 పరుగులతో విశాఖ జట్టు గెలుపొందింది. ఆర్గనైజింగ్ కన్వీనర్‌గా ఎన్.లాల్ బహుదూర్ వ్యవహరించారు.
Similar News
News March 24, 2025
SKLM: గిరిజన రైతుల శ్రమకు జాతీయ గుర్తింపు

ఏపీలోని అరకు లోయ నుంచి వచ్చిన స్వచ్ఛమైన, జిఐ ట్యాగ్ పొందిన అరకు కాఫీ ఇప్పుడు పార్లమెంటు ప్రాంగణంలో లభిస్తోందని, 1.5 లక్షల మంది గిరిజన రైతుల కఠోర శ్రమకు, సంప్రదాయానికి ప్రతీకని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పార్లమెంటులో అరకు కాఫీ అందుబాటులోకి తీసుకురావడానికి పీఎం నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు సహకారం ఎంతో గొప్పదని, వారిద్దరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
News March 24, 2025
శ్రీకాకుళం: జిల్లాలో నేడు ఈ మండలాల వారికి అలర్ట్

శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు మండలాల్లో సోమవారం ఎండ తీవ్రత అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని APSDMA తెలిపింది. జిల్లాలోని బూర్జ, హిరమండలం, ఎల్.ఎన్ పేట, సరుబుజ్జిలి మండలాల్లో 37 డిగ్రీలకు పైగా ఎండ తీవ్రతగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆయా మండలాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చిన్నారులు, వృద్ధులు విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.
News March 24, 2025
SKLM: ‘ఉల్లాస్ అక్షరాస్యత పరీక్షకు 39946 మంది హాజరు’

శ్రీకాకుళం జిల్లాలోని అన్ని మండలాల్లో ఆదివారం జరిగిన ఉల్లాస్ అక్షరాస్యత పరీక్షకు 39,946 మంది హాజరయ్యారు. ఈ విషయాన్ని డీఆర్డీఏ వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ పెద్దింటి కిరణ్ కుమార్ తెలిపారు. తొలుత అన్ని మండలాల్లోని ఏరియా కోఆర్డినేటర్లు ఏపీఎంలు ఆయా అభ్యర్థులు పేర్లు నమోదు చేశారని ఆయన అన్నారు. ప్రభుత్వం పటిష్ఠంగా చేపడుతున్న వయోజనులకు అక్షరాస్యత కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు.